విన్నపము సేయ మాకు వేసటయ్యీని
(॥పల్లవి॥)
విన్నపము సేయ మాకు వేసటయ్యీని
యిన్నిటా నీ జాణతన మెన్నటికో కాని
(॥విన్న॥)
యెదుట నీమోము చూచి యిక్కువలు గరఁగఁగ
పొదిగొనఁ బులకించె పొలఁతికిని
చెదరెఁ గస్తూరిబొట్టు శిరసుతురుము జారె
యిదివో నీదయ యింక నెన్నటికో కాని
(॥విన్న॥)
మంచినీమాఁటలు విని మనసు నీపైఁ బారఁగ
యించుకంత చెమరించె నింతిమే నెల్లా
మించెను నిట్టూర్పులు మెరసె తెగుస లెల్ల
యెంచేటినీ వావు లింక నెన్నటికో కాని
(॥విన్న॥)
సంగడిఁ గూచుండి నీతో సరసము లాడఁగాను
రంగుఁదమకము లెక్కె రమణికిని
ఆంగవించి శ్రీ వేంకటాధిప కూడితి విదె
యింగితపు నీప్రియము లెన్నటికో కాని
(||pallavi||)
vinnabamu seya māgu vesaḍayyīni
yinniḍā nī jāṇadana mĕnnaḍigo kāni
(||vinna||)
yĕduḍa nīmomu sūsi yikkuvalu garam̐gam̐ga
pŏdigŏnam̐ bulagiṁchĕ pŏlam̐tigini
sĕdarĕm̐ gastūribŏṭṭu śhirasudurumu jārĕ
yidivo nīdaya yiṁka nĕnnaḍigo kāni
(||vinna||)
maṁchinīmām̐ṭalu vini manasu nībaim̐ bāram̐ga
yiṁchugaṁta sĕmariṁchĕ niṁtime nĕllā
miṁchĕnu niṭṭūrbulu mĕrasĕ tĕgusa lĕlla
yĕṁcheḍinī vāvu liṁka nĕnnaḍigo kāni
(||vinna||)
saṁgaḍim̐ gūsuṁḍi nīdo sarasamu lāḍam̐gānu
raṁgum̐damagamu lĕkkĕ ramaṇigini
āṁgaviṁchi śhrī veṁkaḍādhiba kūḍidi vidĕ
yiṁgidabu nīpriyamu lĕnnaḍigo kāni