విన్నపము నొకటే విచ్చే సేదీ నొకటే
(॥పల్లవి॥)
విన్నపము నొకటే విచ్చే సేదీ నొకటే
అన్ని పనులాయ మమ్ము నంపేవో అంపవో
(॥విన్న॥)
చిత్తమెల్లా నిగిరించెఁ జెక్కులెల్లాఁ జెమరించె
కొత్తవలపు సతికి గోరమాయను
జొత్తులవిభుఁడు నిన్నుఁ జూచినయప్పటినుండు
వత్తివలెనాయ మేను వచ్చేవో రావో
(॥విన్న॥)
పరగ తురుము జారె పచ్చిపులకలు మీరె
వురుటుఁబాయము సతి కొమ్మదాయను
సరసాన నీవు నవ్వు చల్లినయంతటనుండి
యెరవాయ నిద్దురులు యెనసేవో లేవో
(॥విన్న॥)
నిట్టూరుపులు రేఁగె నివ్వరగు లవె మూఁగె
యట్టె కన్నెకాఁగలి యింతాయను
గట్టిగా శ్రీ వేంకటేశ కలిసితివి యింతిని
వొట్టి యీడనే యెప్పుడు నుండేవో వుండవో
(||pallavi||)
vinnabamu nŏgaḍe vichche sedī nŏgaḍe
anni panulāya mammu naṁpevo aṁpavo
(||vinna||)
sittamĕllā nigiriṁchĕm̐ jĕkkulĕllām̐ jĕmariṁchĕ
kŏttavalabu sadigi goramāyanu
jŏttulavibhum̐ḍu ninnum̐ jūsinayappaḍinuṁḍu
vattivalĕnāya menu vachchevo rāvo
(||vinna||)
paraga turumu jārĕ pachchibulagalu mīrĕ
vuruḍum̐bāyamu sadi kŏmmadāyanu
sarasāna nīvu navvu sallinayaṁtaḍanuṁḍi
yĕravāya niddurulu yĕnasevo levo
(||vinna||)
niṭṭūrubulu rem̐gĕ nivvaragu lavĕ mūm̐gĕ
yaṭṭĕ kannĕgām̐gali yiṁtāyanu
gaṭṭigā śhrī veṁkaḍeśha kalisidivi yiṁtini
vŏṭṭi yīḍane yĕppuḍu nuṁḍevo vuṁḍavo