Vinnabamu limkanela vemaarunu

విన్నపము లింకనేల వేమారును
Language

(॥పల్లవి॥)
విన్నపము లింకనేల వేమారును
అన్నిటాఁ దొల్లే తనకు నాలనైతి ననవే

(॥విన్నప॥)
మొదలనే తనకును మొక్కితి నేననవే
వదలి తురుమందుకే వంగె ననవే
నుదురెల్లఁ జెమరించి పదనాయ ననవే
యెదిటికి వచ్చి నన్ను నిట్టేయేలుమనవే

(॥విన్నప॥)
యిన్నిటాఁ దనకుఁ బంత మిచ్చితి నేననవే
చన్నులపై పయ్యదట్టే జారె ననవే
వున్నవి తనముద్రలు వురముపై ననవే
సన్నలనే తనమోవి చవిచూపు మనవే

(॥విన్నప॥)
తనమాఁటలకు లోనై దక్కితి నేననవే
వొనరెఁ బులకలు నావొళ్ళ ననవే
యెనసె శ్రీవేంకటేశుఁ డిదె తానే యనవే
నను నిట్టే మన్నించె నవ్వుమింక ననవే

(||pallavi||)
vinnabamu liṁkanela vemārunu
anniḍām̐ dŏlle tanagu nālanaidi nanave

(||vinnaba||)
mŏdalane tanagunu mŏkkidi nenanave
vadali turumaṁduge vaṁgĕ nanave
nudurĕllam̐ jĕmariṁchi padanāya nanave
yĕdiḍigi vachchi nannu niṭṭeyelumanave

(||vinnaba||)
yinniḍām̐ danagum̐ baṁta michchidi nenanave
sannulabai payyadaṭṭe jārĕ nanave
vunnavi tanamudralu vuramubai nanave
sannalane tanamovi savisūbu manave

(||vinnaba||)
tanamām̐ṭalagu lonai dakkidi nenanave
vŏnarĕm̐ bulagalu nāvŏḽḽa nanave
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍidĕ tāne yanave
nanu niṭṭe manniṁchĕ navvumiṁka nanave