Vinnabamu limka nela vemdugo nela

విన్నపము లిఁక నేల వేఁడుకో నేల
Language

(॥పల్లవి॥)
విన్నపము లిఁక నేల వేఁడుకో నేల
చిన్ననాఁటి సిగ్గులెల్ల చిమ్మి రేఁగె నిఁకను

(॥విన్పప॥)
మన్ననలకె మొక్కితి మాటలకే చొక్కితిని
యిన్నేసి నిన్నుఁ దూరఁగ నిఁకఁ జోటేది
అన్నిటా జాణవు నీవు ఆయము లెఱుఁగుదువు
పన్నిన నా జవ్వనము ఫలియంచె నిఁకను

(॥విన్పప॥)
నవ్వులనె తనిసితి నయాలనే మొనసితి
యెవ్వరు నేమి చెప్పేరు యెడసుద్దులు
నివ్వటిల్లు విటుఁడవు నిజ మాడ నేరుతువు
రవ్వ లైన నాభాగ్యము రతి కెక్కె నిఁకను

(॥విన్నప॥)
ముచ్చటఁ దొప్పఁ దోఁగితి మోహాన విఱ్ఱవీఁగితి
వచ్చె నాపంతము లెల్ల వాసు లేఁటివి
యిచ్చట శ్రీవెంకటేశ్వర యిట్టె నన్నుఁ గూడితివి
మెచ్చిత మొదలు నిన్ను మే లాయ నిఁకమ

(||pallavi||)
vinnabamu lim̐ka nela vem̐ḍugo nela
sinnanām̐ṭi siggulĕlla simmi rem̐gĕ nim̐kanu

(||vinpaba||)
mannanalagĕ mŏkkidi māḍalage sŏkkidini
yinnesi ninnum̐ dūram̐ga nim̐kam̐ joḍedi
anniḍā jāṇavu nīvu āyamu lĕṟum̐guduvu
pannina nā javvanamu phaliyaṁchĕ nim̐kanu

(||vinpaba||)
navvulanĕ tanisidi nayālane mŏnasidi
yĕvvaru nemi sĕpperu yĕḍasuddulu
nivvaḍillu viḍum̐ḍavu nija māḍa neruduvu
ravva laina nābhāgyamu radi kĕkkĕ nim̐kanu

(||vinnaba||)
muchchaḍam̐ dŏppam̐ dom̐gidi mohāna viṭravīm̐gidi
vachchĕ nābaṁtamu lĕlla vāsu lem̐ṭivi
yichchaḍa śhrīvĕṁkaḍeśhvara yiṭṭĕ nannum̐ gūḍidivi
mĕchchida mŏdalu ninnu me lāya nim̐kama