Vinnabamu laalagimchi vinavayyaa

విన్నపము లాలకించి వినవయ్యా
Language

(॥పల్లవి॥)
విన్నపము లాలకించి వినవయ్యా
యెన్నికఁగా నీకె పొందు నీడేరించవయ్యా

(॥విన్న॥)
తలఁచు నెప్పుడు నిన్నుఁ దమకించు రతులకు
పిలుచు మచ్చికతోడఁ బేరుకొని
చెలులతో నీ సుద్దులు చెప్పుకొను బలుమారు
కలికి చందము లివి కరుణించవయ్యా

(॥విన్న॥)
నిక్కి నిక్కి చూచును నీ రాకలో కోరు
మొక్కు నివున్న దిక్కుకు మొగమై యుండి
అక్కున నదుముకొను నట్టె నీ వుంగరము
గక్కన నింతి నింతట గారవించవయ్యా

(॥విన్న॥)
నీ రూపు పటాన వ్రాసు నివ్వెరగుతో నిలుచు
సారె నీ మోవి తేనెకు నోరూరును
యీరీతి శ్రీవేంకటేశ యీక యలమేలుమంగ
కూరిమి నేలితివి మక్కువఁ బాయకవయ్యా

(||pallavi||)
vinnabamu lālagiṁchi vinavayyā
yĕnnigam̐gā nīgĕ pŏṁdu nīḍeriṁchavayyā

(||vinna||)
talam̐su nĕppuḍu ninnum̐ damagiṁchu radulagu
pilusu machchigadoḍam̐ berugŏni
sĕlulado nī suddulu sĕppugŏnu balumāru
kaligi saṁdamu livi karuṇiṁchavayyā

(||vinna||)
nikki nikki sūsunu nī rāgalo koru
mŏkku nivunna dikkugu mŏgamai yuṁḍi
akkuna nadumugŏnu naṭṭĕ nī vuṁgaramu
gakkana niṁti niṁtaḍa gāraviṁchavayyā

(||vinna||)
nī rūbu paḍāna vrāsu nivvĕragudo nilusu
sārĕ nī movi tenĕgu norūrunu
yīrīdi śhrīveṁkaḍeśha yīga yalamelumaṁga
kūrimi nelidivi makkuvam̐ bāyagavayyā