విన్నపమిది యొకటి వేవేలు మారులకును
(॥పల్లవి॥)
విన్నపమిది యొకటి వేవేలు మారులకును
సన్నలను చాయలను సంతమౌటే మేలు
(॥విన్న॥)
చెలిమియొకరు వచ్చి చేసి పెట్టవచ్చునా
అలరి తమయంతనే అందుఁగాక
చెలులము మాకు బుద్ది చెప్పఁగా వసములా
వెసలేని లోలోని వేడుకింతే కాక
(॥విన్న॥)
కూరిమి యెవ్వరైనఁ గోన వేయ వసమా
తారుకాణైన తమ తమి గాక
సారె నూడిగపువారు చవిసేయవచ్చునా
మేరమీర నప్పటిమేళములు గాక
(॥విన్న॥)
శ్రీవేంకటేశ బలిమిసేయ మాకు వసమా
మీవలెఁ గూడినవి మెచ్చులు గాక
యీవిధాన నండవారు యెచ్చరించ నోపుదురా
కైవమైనయట్టి గరిమెలు గాక
(||pallavi||)
vinnabamidi yŏgaḍi vevelu mārulagunu
sannalanu sāyalanu saṁtamauḍe melu
(||vinna||)
sĕlimiyŏgaru vachchi sesi pĕṭṭavachchunā
alari tamayaṁtane aṁdum̐gāga
sĕlulamu māgu buddi sĕppam̐gā vasamulā
vĕsaleni loloni veḍugiṁte kāga
(||vinna||)
kūrimi yĕvvarainam̐ gona veya vasamā
tārugāṇaina tama tami gāga
sārĕ nūḍigabuvāru saviseyavachchunā
meramīra nappaḍimeḽamulu gāga
(||vinna||)
śhrīveṁkaḍeśha balimiseya māgu vasamā
mīvalĕm̐ gūḍinavi mĕchchulu gāga
yīvidhāna naṁḍavāru yĕchchariṁcha nobudurā
kaivamainayaṭṭi garimĕlu gāga