Vinnabamide po vimtivo vinavo kaani

విన్నపమిదె పో వింటివో వినవో కాని
Language

(॥పల్లవి॥)
విన్నపమిదె పో వింటివో వినవో కాని
కన్ను గిరిపేవేమి కారణమో కాని

(॥విన్న॥)
మాఁటలివి మంచివేపో మనసే తెలియఁగాని
ఆఁటదానఁ బుణ్యపాప మది నీదేపో
నాఁటిన సెలవులను నవ్వులు నవ్వే నిది యౌఁబో
యేఁటికౌఁతా వెనకముం దెంచలేము గాని

(॥విన్న॥)
ననుపెల్లా మంచిదేపో నడవ డెఱఁగఁగాని
యెనసితి పరభారా లింక నీవేపో
నను నీవు సారెసారె నమ్మించే విది యౌఁబో
కొనయౌతా మొదలౌతా గుట్టెఱఁగఁగాని

(॥విన్న॥)
పాయమిది మంచిదేపో పంతము లెఱఁగఁగాని
అయమంటి కూడితి నీయాసఁ గంటిఁబో
యీయెడ శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
రేయి - పగ లిదియని రీతెఱఁగఁ గాని

(||pallavi||)
vinnabamidĕ po viṁṭivo vinavo kāni
kannu giribevemi kāraṇamo kāni

(||vinna||)
mām̐ṭalivi maṁchivebo manase tĕliyam̐gāni
ām̐ṭadānam̐ buṇyabāba madi nīdebo
nām̐ṭina sĕlavulanu navvulu navve nidi yaum̐bo
yem̐ṭigaum̐tā vĕnagamuṁ dĕṁchalemu gāni

(||vinna||)
nanubĕllā maṁchidebo naḍava ḍĕṟam̐gam̐gāni
yĕnasidi parabhārā liṁka nīvebo
nanu nīvu sārĕsārĕ nammiṁche vidi yaum̐bo
kŏnayaudā mŏdalaudā guṭṭĕṟam̐gam̐gāni

(||vinna||)
pāyamidi maṁchidebo paṁtamu lĕṟam̐gam̐gāni
ayamaṁṭi kūḍidi nīyāsam̐ gaṁṭim̐bo
yīyĕḍa śhrīveṁkaḍeśha yinniḍā nannelidivi
reyi - paga lidiyani rīdĕṟam̐gam̐ gāni