విన్నపమిదె నీకు వినుము వద్దు పరాకు
(॥పల్లవి॥)
విన్నపమిదె నీకు వినుము వద్దు పరాకు
ఇన్నిటా నీకు మేలు యిట్టె చెలి నేలు
(॥విన్న॥)
వేడుకకు వెలలేదు వెలఁదికి నీకుఁ బోదు
వాడికైనవల పింక వసముగాదు
యీడువచ్చు నిద్దరికి నింపులు మాయిందరికి
జోడుగూడు విచ్చేయు మాసుదతినగరికి
(॥విన్న॥)
యెప్పుడుఁ గలదు పొందు యీకెమోవి నీకువిందు
కుప్పలుగా నిన్ను వేఁడుకొన్నదే సందు
చెప్పనేఁటికి యలపు చిత్త మీకెపైం గొలుపు
నెప్పునఁ గాఁగిటఁ గూడీ నీకరుణ నిలుపు
(॥విన్న॥)
అలమేల్మంగదేవులు అన్నిటాఁగూడేవావులు
నెలకొనెఁ గన్నులను నిండుఁగావులు
నిలిచి శ్రీవేంకటేశ నీరతులే ఇంతసేసె
వెలలేని నవ్వుల వెన్నెలలు గాసె
(||pallavi||)
vinnabamidĕ nīgu vinumu vaddu parāgu
inniḍā nīgu melu yiṭṭĕ sĕli nelu
(||vinna||)
veḍugagu vĕlaledu vĕlam̐digi nīgum̐ bodu
vāḍigainavala piṁka vasamugādu
yīḍuvachchu niddarigi niṁpulu māyiṁdarigi
joḍugūḍu vichcheyu māsudadinagarigi
(||vinna||)
yĕppuḍum̐ galadu pŏṁdu yīgĕmovi nīguviṁdu
kuppalugā ninnu vem̐ḍugŏnnade saṁdu
sĕppanem̐ṭigi yalabu sitta mīgĕbaiṁ gŏlubu
nĕppunam̐ gām̐giḍam̐ gūḍī nīgaruṇa nilubu
(||vinna||)
alamelmaṁgadevulu anniḍām̐gūḍevāvulu
nĕlagŏnĕm̐ gannulanu niṁḍum̐gāvulu
nilisi śhrīveṁkaḍeśha nīradule iṁtasesĕ
vĕlaleni navvula vĕnnĕlalu gāsĕ