Vinnabaalu seyagure vegudaamkaanu

విన్నపాలు సేయకురే వేగుదాఁకాను
Language

(॥పల్లవి॥)
విన్నపాలు సేయకురే వేగుదాఁకాను
అన్నిటా నిచ్చకములే యాడుదముగాని

(॥విన్న॥)
మంతనాలాడకురే మనసుదెలియుదాఁకా
కాంతుఁడు దా నేమనీనో కందముగాని
పంతాలు నెరపకురే పడఁతిఁ గలయుదాఁకా
చెంతనుండి ప్రియములే చెప్పుదముగాని

(॥విన్న॥)
తత్తరించి పిల్వకురే తానే వచ్చిన దాఁకా
యిత్తలఁ గానికె సారె నిత్తముగాని
మొత్తమి నాతని నంతమోవనాడి దూరకురే
బత్తితోడ మీఁదఁ మీఁదఁ బై కొందముగాని

(॥విన్న॥)
సన్నలు సేయకురే సంగడి నవ్వినదాఁకా
యెన్నిక ముందరికత లెంతముగాని
చెన్నుమీర నింతిఁ గూడె శ్రీవేంకటేశుఁడిట్టె
వన్నెకెక్కఁ బొగడరే వద్దన్నదాఁకాను

(||pallavi||)
vinnabālu seyagure vegudām̐kānu
anniḍā nichchagamule yāḍudamugāni

(||vinna||)
maṁtanālāḍagure manasudĕliyudām̐kā
kāṁtum̐ḍu dā nemanīno kaṁdamugāni
paṁtālu nĕrabagure paḍam̐tim̐ galayudām̐kā
sĕṁtanuṁḍi priyamule sĕppudamugāni

(||vinna||)
tattariṁchi pilvagure tāne vachchina dām̐kā
yittalam̐ gānigĕ sārĕ nittamugāni
mŏttami nādani naṁtamovanāḍi dūragure
battidoḍa mīm̐dam̐ mīm̐dam̐ bai kŏṁdamugāni

(||vinna||)
sannalu seyagure saṁgaḍi navvinadām̐kā
yĕnniga muṁdarigada lĕṁtamugāni
sĕnnumīra niṁtim̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ
vannĕgĕkkam̐ bŏgaḍare vaddannadām̐kānu