Vinnabaalu nem jeside vemgemai tomsu

విన్నపాలు నేఁ జేసితే వెంగెమై తోఁచు
Language

(॥పల్లవి॥)
విన్నపాలు నేఁ జేసితే వెంగెమై తోఁచు
నిన్ను నీవే చూచుకొనే నేర్పు నీకు వలదా

(॥విన్న॥)
యెగసక్కేనకు నిన్ను యెవ్వతె వొగడినాను
జిగితో నవ్వేవుగాని సిగ్గువడవు
మొగము చూచితే నీమోవినే మచ్చమున్నది
తగుఁదగదని యెంచి తలఁచుకోవలదా

(॥విన్న॥)
గుట్టు దెలియవలసి కొమ్మ వొకతె మెచ్చితే
అట్టె యౌనంటా నీవు నంగవించేవు
పట్టి యిచ్చీ నీవొళ్ల పరకాంతల భోగాలు
రట్టయ్యే ననుచు పదరక వుండవలదా

(॥విన్న॥)
యెంగిలి సేయవలసి యెవ్వతె వీడె మిచ్చినా
సంగతాయనంటా నట్టె చవిగొనేవు
కుంగక శ్రీ వేంకటేశ కూడితి నలమేల్మంగను
యింగితాకారాలు నీవే యెఱుఁగుకోవలదా

(||pallavi||)
vinnabālu nem̐ jeside vĕṁgĕmai tom̐su
ninnu nīve sūsugŏne nerbu nīgu valadā

(||vinna||)
yĕgasakkenagu ninnu yĕvvadĕ vŏgaḍinānu
jigido navvevugāni sigguvaḍavu
mŏgamu sūside nīmovine machchamunnadi
tagum̐dagadani yĕṁchi talam̐sugovaladā

(||vinna||)
guṭṭu dĕliyavalasi kŏmma vŏgadĕ mĕchchide
aṭṭĕ yaunaṁṭā nīvu naṁgaviṁchevu
paṭṭi yichchī nīvŏḽla paragāṁtala bhogālu
raṭṭayye nanusu padaraga vuṁḍavaladā

(||vinna||)
yĕṁgili seyavalasi yĕvvadĕ vīḍĕ michchinā
saṁgadāyanaṁṭā naṭṭĕ savigŏnevu
kuṁgaga śhrī veṁkaḍeśha kūḍidi nalamelmaṁganu
yiṁgidāgārālu nīve yĕṟum̐gugovaladā