విన్నప మేవిూఁ జేయకు విభుఁడు తానే యెఱిఁగి
(॥పల్లవి॥)
విన్నప మేవిూఁ జేయకు విభుఁడు తానే యెఱిఁగి
తన్నుఁ దానే యీడకు రాఁదలఁపయ్యీఁ గాని
(॥విన్నప॥)
జవళి నిమ్మపండ్లు సరిఁ గాను కియ్యవే
అవి నాచన్నులఁ బోలు నని తలఁపయ్యీ గాని
తివురుచు నిటు జుంటితేనె గాను కియ్యనే
తవిలి నామోవితీపు తలఁపయ్యీఁ గాని
(॥విన్నప॥)
పొగడొందుఁ దామెరపువ్వు గాను కియ్యవే
నిగనిగని నామోము నేఁడు దలఁపయ్యీఁ గాని
మొగి బచ్చెనచక్ర మిమ్ముల గాను కియ్యవే
తగ నాపిఱుఁదు మదిఁ దలఁపయ్యీఁ గాని
(॥విన్నప॥)
పొలసి వేరొక్క పైఁడిబొమ్మఁ గాను కియ్యవే
పలు వన్నెల నారూపము దలఁపయ్యీఁగాని
అలమి శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
తలిరు చూపరే నన్నే తలఁపయ్యీఁ గాని
(||pallavi||)
vinnaba meviూm̐ jeyagu vibhum̐ḍu tāne yĕṟim̐gi
tannum̐ dāne yīḍagu rām̐dalam̐payyīm̐ gāni
(||vinnaba||)
javaḽi nimmabaṁḍlu sarim̐ gānu kiyyave
avi nāsannulam̐ bolu nani talam̐payyī gāni
tivurusu niḍu juṁṭidenĕ gānu kiyyane
tavili nāmovidību talam̐payyīm̐ gāni
(||vinnaba||)
pŏgaḍŏṁdum̐ dāmĕrabuvvu gānu kiyyave
niganigani nāmomu nem̐ḍu dalam̐payyīm̐ gāni
mŏgi bachchĕnasakra mimmula gānu kiyyave
taga nābiṟum̐du madim̐ dalam̐payyīm̐ gāni
(||vinnaba||)
pŏlasi verŏkka paim̐ḍibŏmmam̐ gānu kiyyave
palu vannĕla nārūbamu dalam̐payyīm̐gāni
alami śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
taliru sūbare nanne talam̐payyīm̐ gāni