Vinnaba memi sesemu veginamtaanu

విన్నప మేమి సేసేము వేగినంతాను
Language

(॥పల్లవి॥)
విన్నప మేమి సేసేము వేగినంతాను
యెన్నికగా నాపె చన వీడేరించవయ్యా

(॥విన్న॥)
నెలత నీ కిచ్చినకానికఁ దలంచుకోవయ్య
తళుకుఁగన్నులసన్న దలఁచవయ్యా
అలరిసేసిన వినయము దలఁచుకోవయ్య
యెలమి నాపెకడకు నిట్టె రావయ్యా

(॥విన్న॥)
మక్కువతో నాడినమాఁట దలఁచుకోవయ్య
తక్కక యాపెవలపు దలఁచుకోవయ్యా
మొక్కిన చిన్నిచేతులమోడ్పు దలఁచుకోవయ్య
యిక్కువనున్నది యిట్టె యింటికి రావయ్యా

(॥విన్న॥)
వడి నిన్నుఁగొల్చినభాము దలఁచుకోవయ్యా
తడయక సేసేసేవ దలఁచుకోవయ్యా
అడరి శ్రీవేంకటేశ ఆకె యలమేలుమంగ
యెడయక కూడితివి యిప్పుడు రావయ్యా

(||pallavi||)
vinnaba memi sesemu veginaṁtānu
yĕnnigagā nābĕ sana vīḍeriṁchavayyā

(||vinna||)
nĕlada nī kichchinagānigam̐ dalaṁchugovayya
taḽugum̐gannulasanna dalam̐savayyā
alarisesina vinayamu dalam̐sugovayya
yĕlami nābĕgaḍagu niṭṭĕ rāvayyā

(||vinna||)
makkuvado nāḍinamām̐ṭa dalam̐sugovayya
takkaga yābĕvalabu dalam̐sugovayyā
mŏkkina sinnisedulamoḍpu dalam̐sugovayya
yikkuvanunnadi yiṭṭĕ yiṁṭigi rāvayyā

(||vinna||)
vaḍi ninnum̐gŏlsinabhāmu dalam̐sugovayyā
taḍayaga seseseva dalam̐sugovayyā
aḍari śhrīveṁkaḍeśha āgĕ yalamelumaṁga
yĕḍayaga kūḍidivi yippuḍu rāvayyā