Vinna kannavaarigellaa veragayyeeni

విన్న కన్నవారికెల్లా వెరగయ్యీని
Language

(॥పల్లవి॥)
విన్న కన్నవారికెల్లా వెరగయ్యీని
కన్నియను లాలించితే కాంతలెల్లా మెత్తురు

(॥విన్న॥)
సురటి విసరరాదా సుద్దు లడుగఁగరాదా
పొరుగున నుండి వచ్చె పొలఁతి
సరసము లాడితివి చవులెల్లా నేర్పితివి
యెరవు చేసుకుండితే నెట్టుండునో మనను

(॥విన్న॥)
ననుపు చేసుకరాదా నవ్వులు నవ్వఁగ రాదా
చనవునఁ బెనఁగీని సకియ
వినయము లాడేరి వేడుకలు దై వారె
యెనసి వుండకుండితే నేమందురో చెలులు

(॥విన్న॥)
కదిసి కూచుండరాదా కాఁగిలించుకొనరాదా
యెదుట సేవలు సేసీ నీమగువ
పొదిగి శ్రీవేంకటేశ పొందు లెరిఁగించితిని
వదలక వుండితేను వలపెంత హెచ్చునో

(||pallavi||)
vinna kannavārigĕllā vĕragayyīni
kanniyanu lāliṁchide kāṁtalĕllā mĕtturu

(||vinna||)
suraḍi visararādā suddu laḍugam̐garādā
pŏruguna nuṁḍi vachchĕ pŏlam̐ti
sarasamu lāḍidivi savulĕllā nerbidivi
yĕravu sesuguṁḍide nĕṭṭuṁḍuno mananu

(||vinna||)
nanubu sesugarādā navvulu navvam̐ga rādā
sanavunam̐ bĕnam̐gīni sagiya
vinayamu lāḍeri veḍugalu dai vārĕ
yĕnasi vuṁḍaguṁḍide nemaṁduro sĕlulu

(||vinna||)
kadisi kūsuṁḍarādā kām̐giliṁchugŏnarādā
yĕduḍa sevalu sesī nīmaguva
pŏdigi śhrīveṁkaḍeśha pŏṁdu lĕrim̐giṁchidini
vadalaga vuṁḍidenu valabĕṁta hĕchchuno