విన్న కన్న వారికెల్లా వెరగయ్యీని
(॥పల్లవి॥)
విన్న కన్న వారికెల్లా వెరగయ్యీని
చిన్నదాన వెంతేసిచేఁతలు సేసేవే
(॥విన్న॥)
చిన్నిచిన్నినగవులు సెలవులఁ జిందుకొంటా
సన్నపుటెలుఁగులను సాదించుకొంటా
కిన్నెరమీఁటులు మీఁటి గిలిగించుకొంటాను
ఇన్నేసివిధాలఁ బతి నెంత యెలయించేవే
(॥విన్న॥)
పాఁగినగుబ్బలు సారె పయ్యదను మూసుకొంటా
మాఁగినమోవి చూపి మలసుకొంటా
కాఁగెఁడేసిపిరుఁదులఁ గడుమురుసుకొంటాను
వీఁగ కితనిముందర వేసా లెంతసేసేవే
(॥విన్న॥)
చేరఁడేసికన్నులను చెలరేఁగి చూచుకొంటా
కూరిమి మాటలలోనే కొసరుకొంటా
యీరీతి శ్రీవేంకటేశు నింత సేసి కూడితిని
మేరతో నన్నితఁ డేలె మేకు లేమిచూపేవే
(||pallavi||)
vinna kanna vārigĕllā vĕragayyīni
sinnadāna vĕṁtesisem̐talu seseve
(||vinna||)
sinnisinninagavulu sĕlavulam̐ jiṁdugŏṁṭā
sannabuḍĕlum̐gulanu sādiṁchugŏṁṭā
kinnĕramīm̐ṭulu mīm̐ṭi giligiṁchugŏṁṭānu
innesividhālam̐ badi nĕṁta yĕlayiṁcheve
(||vinna||)
pām̐ginagubbalu sārĕ payyadanu mūsugŏṁṭā
mām̐ginamovi sūbi malasugŏṁṭā
kām̐gĕm̐ḍesibirum̐dulam̐ gaḍumurusugŏṁṭānu
vīm̐ga kidanimuṁdara vesā lĕṁtaseseve
(||vinna||)
seram̐ḍesigannulanu sĕlarem̐gi sūsugŏṁṭā
kūrimi māḍalalone kŏsarugŏṁṭā
yīrīdi śhrīveṁkaḍeśhu niṁta sesi kūḍidini
merado nannidam̐ ḍelĕ megu lemisūbeve