Vinibimchave yee suddi vine nenu

వినిపించవే యీ సుద్ది వినే నేను
Language

(॥పల్లవి॥)
వినిపించవే యీ సుద్ది వినే నేను
వనితరో యిన్నాళ్లవలెఁ గాదు నీవు

(॥విని॥)
చెలరేఁగి చెలరేఁగి చెలులతో నవ్వేవు
అలనీపతి నీతో మాఁటాడెనటె
తలవీడి మొలవీడి దగ దవ్వులఁబడేవు
వలపులసివములు వడిఁబట్టెనటవే

(॥విని॥)
తమకించి తమకించి తడఁబడ నడచేవు
అమరఁగ రతులు నీకబ్బెనటె
చెమటలమేనితో చిందువఁదై యుందానవు
కొమరెమదము నీకు గొనకొనెనటవె

(॥విని॥)
పదరి పదరి నీవు పాటలెల్లాఁ బాడేవు
యెదుటిశ్రీవేంకటేశుఁ డెనసెనటె
చెదరనికళలతో చిమ్ముల మాఁటలాడేవు
మరదరాజ్యగర్వము మతిఁ బట్టెనటవె

(||pallavi||)
vinibiṁchave yī suddi vine nenu
vanidaro yinnāḽlavalĕm̐ gādu nīvu

(||vini||)
sĕlarem̐gi sĕlarem̐gi sĕlulado navvevu
alanībadi nīdo mām̐ṭāḍĕnaḍĕ
talavīḍi mŏlavīḍi daga davvulam̐baḍevu
valabulasivamulu vaḍim̐baṭṭĕnaḍave

(||vini||)
tamagiṁchi tamagiṁchi taḍam̐baḍa naḍasevu
amaram̐ga radulu nīgabbĕnaḍĕ
sĕmaḍalamenido siṁduvam̐dai yuṁdānavu
kŏmarĕmadamu nīgu gŏnagŏnĕnaḍavĕ

(||vini||)
padari padari nīvu pāḍalĕllām̐ bāḍevu
yĕduḍiśhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕnaḍĕ
sĕdaranigaḽalado simmula mām̐ṭalāḍevu
maradarājyagarvamu madim̐ baṭṭĕnaḍavĕ