వినే మానతియ్యవయ్య వేడుకలయ్యీ మాకు
(॥పల్లవి॥)
వినే మానతియ్యవయ్య వేడుకలయ్యీ మాకు
పెనఁగొనెనో వావులు ప్రియముతో మీకు
(॥॥)
కందువ నీ మొగమునఁ గళలు దేరీ నేఁడు
అందెనో మాట పలుకు లాపెకు నీకు
చిందు వందు లైనవి జిగి గొని తురుములు
పొందు లొకరొకరికి పొసఁగెనో తొలుతే
(॥॥)
చాయలు సన్నలు మీకు సరి వచ్చి వున్నది
ఆయనో పెండ్లి సోబన మప్పుడే మీకు
దాయక పాయక లోలోఁ దగిలి నవ్వుకొనేరు
చేయి మీఁదై మీకు సిగ్గు లెల్లాఁ దేరెనో
(॥॥)
చెలప చెమటలతో చిమ్మి రేఁగి వున్నవారు
అలసెనో మీ తనువు లట్టే రతుల
యెలమి శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి
తలఁ చుక వుంటిరో యీ తగవులు మీరు
(||pallavi||)
vine mānadiyyavayya veḍugalayyī māgu
pĕnam̐gŏnĕno vāvulu priyamudo mīgu
(||||)
kaṁduva nī mŏgamunam̐ gaḽalu derī nem̐ḍu
aṁdĕno māḍa palugu lābĕgu nīgu
siṁdu vaṁdu lainavi jigi gŏni turumulu
pŏṁdu lŏgarŏgarigi pŏsam̐gĕno tŏlude
(||||)
sāyalu sannalu mīgu sari vachchi vunnadi
āyano pĕṁḍli sobana mappuḍe mīgu
dāyaga pāyaga lolom̐ dagili navvugŏneru
seyi mīm̐dai mīgu siggu lĕllām̐ derĕno
(||||)
sĕlaba sĕmaḍalado simmi rem̐gi vunnavāru
alasĕno mī tanuvu laṭṭe radula
yĕlami śhrī veṁkaḍeśha yiṁtalo nannelidivi
talam̐ suga vuṁṭiro yī tagavulu mīru