Vinayame nerabide veduga vutteemgaaga

వినయమే నెరపితే వేడుక వుట్టీఁగాక
Language

(॥పల్లవి॥)
వినయమే నెరపితే వేడుక వుట్టీఁగాక
వనిత నీ వీతనితో వాసులెంచనేలే

(॥విన॥)
తెగరాని యెడలకు తియ్యనిమాఁటలే మేలు
మొగమోట గలిగితే మొక్కులే మేలు
తగులు వాయునిచోట తామిలి చూపుటే మేలు
మగువ నీ వీతనితో మారుమలయనేలే

(॥విన॥)
యెరవులేని పొందుల తియ్యకొనుటే మేలు
మరిగి పాయనివేళ మచ్చికే మేలు
విరసము లేకుండితే వినోదములే మేలు
తరుణి యీతనితో పంతాలు నీకు నేలే

(॥విన॥)
కడు సిగ్గులెక్కుడైతే కందువ నవ్వులే మేలు
వుడివోనిరతులకు వొద్దికే మేలు
యెడయక శ్రీవేంకటేశుఁ దిట్టె నిన్ను నేలె
పడఁతి నీ వీతనితో పచారింపు లేలే

(||pallavi||)
vinayame nĕrabide veḍuga vuṭṭīm̐gāga
vanida nī vīdanido vāsulĕṁchanele

(||vina||)
tĕgarāni yĕḍalagu tiyyanimām̐ṭale melu
mŏgamoḍa galigide mŏkkule melu
tagulu vāyunisoḍa tāmili sūbuḍe melu
maguva nī vīdanido mārumalayanele

(||vina||)
yĕravuleni pŏṁdula tiyyagŏnuḍe melu
marigi pāyaniveḽa machchige melu
virasamu leguṁḍide vinodamule melu
taruṇi yīdanido paṁtālu nīgu nele

(||vina||)
kaḍu siggulĕkkuḍaide kaṁduva navvule melu
vuḍivoniradulagu vŏddige melu
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ diṭṭĕ ninnu nelĕ
paḍam̐ti nī vīdanido pasāriṁpu lele