Vinayame melu vitraveemgugamte

వినయమే మేలు విఱ్ఱవీఁగుకంటె
Language

(॥పల్లవి॥)
వినయమే మేలు విఱ్ఱవీఁగుకంటె
పెను తమకాలు బేలవైతివి

(॥విన॥)
చెలరేఁగి నీకు సేవలెల్లాఁ జేసి
జలజాక్షి నిన్ను సాదించెను
పలుకుఁబంతము పడఁతి కీడేరె
బలిమికాఁడవై భ్రమసితివి

(॥విన॥)
చెంతనుండి యీకె సెలవుల నవ్వి
కాంత నీ మనసు కరఁచెను
శాంతముననే సకియ గెలిచె
వింత మదమున విరహివయితి

(॥విన॥)
చెలిమితో గూడి శ్రీవేంకటేశ ని-
న్నలమేలుమంగ వలపించెను
చలువతోడనే సతి వురమెక్కె
తలపుల నాకు దక్కితివి

(||pallavi||)
vinayame melu viṭravīm̐gugaṁṭĕ
pĕnu tamagālu belavaidivi

(||vina||)
sĕlarem̐gi nīgu sevalĕllām̐ jesi
jalajākṣhi ninnu sādiṁchĕnu
palugum̐baṁtamu paḍam̐ti kīḍerĕ
balimigām̐ḍavai bhramasidivi

(||vina||)
sĕṁtanuṁḍi yīgĕ sĕlavula navvi
kāṁta nī manasu karam̐sĕnu
śhāṁtamunane sagiya gĕlisĕ
viṁta madamuna virahivayidi

(||vina||)
sĕlimido gūḍi śhrīveṁkaḍeśha ni-
nnalamelumaṁga valabiṁchĕnu
saluvadoḍane sadi vuramĕkkĕ
talabula nāgu dakkidivi