Vinayame mamchidi vibhunidonu

వినయమే మంచిది విభునితోను
Language

(॥పల్లవి॥)
వినయమే మంచిది విభునితోను
ననుఁ జూప కాతనితో నవ్వవే నా మారు

(॥విన॥)
వచ్చితేనేమే విభుని వద్దనఁగ వచ్చునా
మచ్చికతోఁ బీఁటవెట్టి మాఁటలాడవే
నిచ్చపెండ్లికొడుకుతో నిష్టూరము చెల్లునా
ఇచ్చకములే యాడవే ఇప్పుడే నామారు

(॥విన॥)
వేఁడుకొంటే నేమాయనే వింతవాఁడా తానేమి
నాఁడే కోపమెల్లాఁ దీరె నావాఁడే తాను
ఆఁడుదానఁ దనతో నే నౌఁగాదనఁ బనియేమే
పోఁడిమితో వీడెమీవే పొద్దున నామారు

(॥విన॥)
సరసమాడితేనేమే చవులుగాక మానీనా
యెరవు లేకుండితే మే లియ్యకొనవే
ఇనవై శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
గరిమ నీ విందుకుఁ బొగడవే నామారు

(||pallavi||)
vinayame maṁchidi vibhunidonu
nanum̐ jūba kādanido navvave nā māru

(||vina||)
vachchideneme vibhuni vaddanam̐ga vachchunā
machchigadom̐ bīm̐ṭavĕṭṭi mām̐ṭalāḍave
nichchabĕṁḍligŏḍugudo niṣhṭūramu sĕllunā
ichchagamule yāḍave ippuḍe nāmāru

(||vina||)
vem̐ḍugŏṁṭe nemāyane viṁtavām̐ḍā tānemi
nām̐ḍe kobamĕllām̐ dīrĕ nāvām̐ḍe tānu
ām̐ḍudānam̐ danado ne naum̐gādanam̐ baniyeme
pom̐ḍimido vīḍĕmīve pŏdduna nāmāru

(||vina||)
sarasamāḍideneme savulugāga mānīnā
yĕravu leguṁḍide me liyyagŏnave
inavai śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
garima nī viṁdugum̐ bŏgaḍave nāmāru