వినవే యిఁకనైనా నా విన్నపములు
(॥పల్లవి॥)
వినవే యిఁకనైనా నా విన్నపములు
చెనకితే నేమిటికి సిగ్గులు వడేవే
(॥॥)
చలమేల సాదించేవే సంగడి విరహమేలే
పిలిచితే రాఁడా ప్రియుఁడు నేఁడు
కలగంటి వంటా కాంతవద్ద నుండెనంటా
వెలయ నాతని నెంత వెంగెములాడేవే
(॥॥)
మచ్చరమేమిటికే మరగున నేలుండేవే
ఇచ్చ యెఱిఁగి కూడఁడా యీతఁడు నిన్ను
మచ్చములు గంటి నంటా మరొకతె సేసె నంటా
కుచ్చితానఁ బతినెంత కోపగించేవే
(॥॥)
అప్పటిఁ బంతములేలే అండనుండి పయ్యదఁ
గప్పితే మెచ్చఁడా శ్రీవేంకట విభుఁడు
వొప్పి నిన్నుఁ గూడె నంటా వొగి మోవి యెంగిలంటా
చొప్పున నీతని నెంత సొలయఁ జూచేవే
(||pallavi||)
vinave yim̐kanainā nā vinnabamulu
sĕnagide nemiḍigi siggulu vaḍeve
(||||)
salamela sādiṁcheve saṁgaḍi virahamele
piliside rām̐ḍā priyum̐ḍu nem̐ḍu
kalagaṁṭi vaṁṭā kāṁtavadda nuṁḍĕnaṁṭā
vĕlaya nādani nĕṁta vĕṁgĕmulāḍeve
(||||)
machcharamemiḍige maraguna neluṁḍeve
ichcha yĕṟim̐gi kūḍam̐ḍā yīdam̐ḍu ninnu
machchamulu gaṁṭi naṁṭā marŏgadĕ sesĕ naṁṭā
kuchchidānam̐ badinĕṁta kobagiṁcheve
(||||)
appaḍim̐ baṁtamulele aṁḍanuṁḍi payyadam̐
gappide mĕchcham̐ḍā śhrīveṁkaḍa vibhum̐ḍu
vŏppi ninnum̐ gūḍĕ naṁṭā vŏgi movi yĕṁgilaṁṭā
sŏppuna nīdani nĕṁta sŏlayam̐ jūseve