వినవే యెక్కడి సుద్ది వేగ మామాట
(॥పల్లవి॥)
వినవే యెక్కడి సుద్ది వేగ మామాట
మనసులోఁ జల ముంటే మర్మములు మాన్పునా
(॥వినవే॥)
యెంతేసి మాట లాడిన యెచ్చు కుందు గలిగినా
కాంతలకు మగలకుఁ గలదా వేరు
చింత దీర నావేళకు చెక్కు చేయే మరఁ గింతె
పంతపు నెలవినవ్వు బతిమాలింపించెను
(॥వినవే॥)
అవ్వలిమోము లై వున్నా నలుకలు ముంచుకన్నా
జవ్వనపువలపుల చవి దప్పీనా
దవ్వులై యావేళకు తలవంపులే మరఁగు
చివ్వనఁ గనుచూపులె చెలుములు నేయవా
(॥వినవే॥)
సిగ్గులు పైకొనినాను చేఁతలు గడు మీరినా
నగ్గళపు రతివేళ నడ్డ మున్నదా
యెగ్గు దీ శ్రీవెంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
బెగ్గిలినాఁ దమకము ప్రియములు రేఁచునే
(||pallavi||)
vinave yĕkkaḍi suddi vega māmāḍa
manasulom̐ jala muṁṭe marmamulu mānpunā
(||vinave||)
yĕṁtesi māḍa lāḍina yĕchchu kuṁdu galiginā
kāṁtalagu magalagum̐ galadā veru
siṁta dīra nāveḽagu sĕkku seye maram̐ giṁtĕ
paṁtabu nĕlavinavvu badimāliṁpiṁchĕnu
(||vinave||)
avvalimomu lai vunnā nalugalu muṁchugannā
javvanabuvalabula savi dappīnā
davvulai yāveḽagu talavaṁpule maram̐gu
sivvanam̐ ganusūbulĕ sĕlumulu neyavā
(||vinave||)
siggulu paigŏninānu sem̐talu gaḍu mīrinā
naggaḽabu radiveḽa naḍḍa munnadā
yĕggu dī śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
bĕggilinām̐ damagamu priyamulu rem̐sune