వినవే యా మాఁట వెలది నీకు నీవె
(॥పల్లవి॥)
వినవే యా మాఁట వెలది నీకు నీవె
అనవే నీ నోటనే అందుకు నుత్తరము
(॥వినవే॥)
పిలిచీఁ గదవె తాను బెట్టుగ సిగ్గు వడఁడు
పిలిచెటిపెద వెందో పిప్పి గట్టెను
కలయు మనీనె కమ్మటిని నన్నును
కలనే తన వురము కాయ గాచె నదివో
(॥వినవే॥)
నవ్వీఁ గదవె తాను నాతోనుఁ గమ్మటిని
నవ్వెటి తన చెక్కులు నంజు లాయను
పవ్వళించీఁ గదె నా పక్కనె తా నప్పటిని
పవ్వళించే యందె తన పను లెల్లఁ దెలిసే
(॥వినవే॥)
చేతుల చాచీఁ గదె చేరి నా కాఁగిటికి నా
చేతికి లోనైనవారు చెలులెల్లాను
యీతల శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
యీతలాతలిపనులు యెన్ని కాయఁ గదవే
(||pallavi||)
vinave yā mām̐ṭa vĕladi nīgu nīvĕ
anave nī noḍane aṁdugu nuttaramu
(||vinave||)
pilisīm̐ gadavĕ tānu bĕṭṭuga siggu vaḍam̐ḍu
pilisĕḍibĕda vĕṁdo pippi gaṭṭĕnu
kalayu manīnĕ kammaḍini nannunu
kalane tana vuramu kāya gāsĕ nadivo
(||vinave||)
navvīm̐ gadavĕ tānu nādonum̐ gammaḍini
navvĕḍi tana sĕkkulu naṁju lāyanu
pavvaḽiṁchīm̐ gadĕ nā pakkanĕ tā nappaḍini
pavvaḽiṁche yaṁdĕ tana panu lĕllam̐ dĕlise
(||vinave||)
sedula sāsīm̐ gadĕ seri nā kām̐giḍigi nā
sedigi lonainavāru sĕlulĕllānu
yīdala śhrīvĕṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
yīdalādalibanulu yĕnni kāyam̐ gadave