వినవే చెలియ నేఁడు విభుని నా చందములు
(॥పల్లవి॥)
వినవే చెలియ నేఁడు విభుని నా చందములు
మునుప నేనే వాని మోవఁగా నాడితినే
(॥వినవే॥)
అలిగిపోయేటివాని నలమి పానుపుమీఁద
బలిమిఁ బడవేసి నేఁ బైకొంటినే
అలసి విడువు మంటా నానవెట్ట రాఁగాను
నులివేఁడి తమ్ములము నోరిలో నించితినే
(॥వినవే॥)
వుఱక శిరసు వంచుకుండఁగా నా వాఁడిగోర
గుఱిగా గడ్డము వట్టి కొసరితినే
చుఱుక నే నని వాఁడు చూచి నన్నుఁ దిట్ట రాఁగా
మొఱగి వాని కెమ్మోవి మోవిఁ బెనచితినే
(॥వినవే॥)
ఆకడిమోమె యుండఁగా నడ్డగించుకొని నేనే
జోకగాఁ గౌఁగిటిలోనఁ జొచ్చుకొంటినే
యీకడ శ్రీవేంకటేశుఁ డిందుకే మెచ్చి నాతోఁ
గెకొన్న అలుక దేరి గక్కనఁ గూడెనే
(||pallavi||)
vinave sĕliya nem̐ḍu vibhuni nā saṁdamulu
munuba nene vāni movam̐gā nāḍidine
(||vinave||)
aligiboyeḍivāni nalami pānubumīm̐da
balimim̐ baḍavesi nem̐ baigŏṁṭine
alasi viḍuvu maṁṭā nānavĕṭṭa rām̐gānu
nulivem̐ḍi tammulamu norilo niṁchidine
(||vinave||)
vuṟaga śhirasu vaṁchuguṁḍam̐gā nā vām̐ḍigora
guṟigā gaḍḍamu vaṭṭi kŏsaridine
suṟuga ne nani vām̐ḍu sūsi nannum̐ diṭṭa rām̐gā
mŏṟagi vāni kĕmmovi movim̐ bĕnasidine
(||vinave||)
āgaḍimomĕ yuṁḍam̐gā naḍḍagiṁchugŏni nene
jogagām̐ gaum̐giḍilonam̐ jŏchchugŏṁṭine
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁduge mĕchchi nādom̐
gĕgŏnna aluga deri gakkanam̐ gūḍĕne