Vinave naamaamtalu vivegimchugonave

వినవే నామాఁటలు వివేకించుకొనవే
Language

(॥పల్లవి॥)
వినవే నామాఁటలు వివేకించుకొనవే
పనులేమి గలిగినా పతిఁ గొసరుదమే

(॥విన॥)
మగువలెల్లా నొక్కటి మనలో విరహమేలే
తగుసవతులమైతే తప్పు వచ్చెనా
మగనికాఁగిలే గతి మఱి యెంత చుట్టినాను
పగలు రేతిరి నొక్కబయటనే కూడీనే

(॥విన॥)
అక్కయేమే చెల్లెలేమే అందులో భేదమున్నదా
నిక్కి యేరాండ్లమైతే నేరమాయనా
చిక్కేటి దాతనిమోవే చేరి యిద్దరినోళ్లకు
చుక్కలూఁ జంద్రుఁడూ నొక్కచూపులోనే కూడునే

(॥విన॥)
నీవు నేను సమమే నేరిచి నడచితేను
దేవుళ్ల మిద్దరమైతే తెలివిలేదా
శ్రీవేంకటేశుఁడు గూడె చెలఁగి నిన్నును నన్నూ
పూవులెల్లా వనమునఁ బూచేవేకదవే

(||pallavi||)
vinave nāmām̐ṭalu vivegiṁchugŏnave
panulemi galiginā padim̐ gŏsarudame

(||vina||)
maguvalĕllā nŏkkaḍi manalo virahamele
tagusavadulamaide tappu vachchĕnā
maganigām̐gile gadi maṟi yĕṁta suṭṭinānu
pagalu rediri nŏkkabayaḍane kūḍīne

(||vina||)
akkayeme sĕllĕleme aṁdulo bhedamunnadā
nikki yerāṁḍlamaide neramāyanā
sikkeḍi dādanimove seri yiddarinoḽlagu
sukkalūm̐ jaṁdrum̐ḍū nŏkkasūbulone kūḍune

(||vina||)
nīvu nenu samame nerisi naḍasidenu
devuḽla middaramaide tĕliviledā
śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ sĕlam̐gi ninnunu nannū
pūvulĕllā vanamunam̐ būsevegadave