Vinavayya needevula vedugaina suddulu

వినవయ్య నీదేవుల వేడుకైన సుద్దులు
Language

(॥పల్లవి॥)
వినవయ్య నీదేవుల వేడుకైన సుద్దులు
పెనగొన్న మచ్చికలఁ బెచ్చువెరిగీని

(॥విన॥)
కొమలి నీగుణములు కొనియాడుకొంటాను
నామువార సెలవుల నవ్వు నవ్వీని
ఆముక నీరూపు మతి నట్టే తలఁచుకొంటాను
వేమరు సంతోసాన విఱ్ఱవీఁగీని

(॥విన॥)
నెట్టుకొని చెలులతో నీసుద్దులు చెప్పుకొంటా
గుట్టుతో లోలోనే సిగ్గులువడీని
దట్టపుటానల నీకుఁ దా నెదురుచూచుకొంటా
వొట్టుక మనోరథాల నోలలాడీని

(॥విన॥)
నెమ్మదిఁ దెరమాటున నీమాటలే వినుకొంటా
చెమ్మఁజెమటలచేతఁ జెలరేఁగీని
యిమ్మల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
కమ్మి నీవిట్టె కూడఁగాఁ గడుమెచ్చీని

(||pallavi||)
vinavayya nīdevula veḍugaina suddulu
pĕnagŏnna machchigalam̐ bĕchchuvĕrigīni

(||vina||)
kŏmali nīguṇamulu kŏniyāḍugŏṁṭānu
nāmuvāra sĕlavula navvu navvīni
āmuga nīrūbu madi naṭṭe talam̐sugŏṁṭānu
vemaru saṁtosāna viṭravīm̐gīni

(||vina||)
nĕṭṭugŏni sĕlulado nīsuddulu sĕppugŏṁṭā
guṭṭudo lolone sigguluvaḍīni
daṭṭabuḍānala nīgum̐ dā nĕdurusūsugŏṁṭā
vŏṭṭuga manorathāla nolalāḍīni

(||vina||)
nĕmmadim̐ dĕramāḍuna nīmāḍale vinugŏṁṭā
sĕmmam̐jĕmaḍalasedam̐ jĕlarem̐gīni
yimmala śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
kammi nīviṭṭĕ kūḍam̐gām̐ gaḍumĕchchīni