Vinaraadu nee suddulu vini vooragumdaraadu

వినరాదు నీ సుద్దులు విని వూరకుండరాదు
Language

(॥పల్లవి॥)
వినరాదు నీ సుద్దులు విని వూరకుండరాదు
ఘనుఁడైన పతినేల కరకరించేవే

(॥విన॥)
చేరివచ్చి నిన్నాతఁడు చెక్కునొక్కి వేఁడుకోఁగా
సారెసారె నీవేల సాదించేవే
కూరిమి గొసరి నీకుచ్చల వట్టితీసితే
దూరి నీవెంతేసి దుండగాలాడేవే

(॥విన॥)
విందువలె మోవిఇచ్చి విడెము చేతి కియ్యఁగా
సందడిం చాతని నెంతజంకించేవే
కందువనుండి పెనఁగి కాఁగిలించుకొనఁగాను
మందెమేళమున నెటు మారుకొనేవే

(॥విన॥)
ఇంటిలో శ్రీవేంకటేశుఁడిట్టె నిన్నుఁ గూడఁగాను
అంటిముట్టి రతి నెంత అలఇంచేవే
నంటున సెలవులను నవ్వులెల్లా నవ్వఁగాను
దంటవై కమ్మటినేల తమకించేవే

(||pallavi||)
vinarādu nī suddulu vini vūraguṁḍarādu
ghanum̐ḍaina padinela karagariṁcheve

(||vina||)
serivachchi ninnādam̐ḍu sĕkkunŏkki vem̐ḍugom̐gā
sārĕsārĕ nīvela sādiṁcheve
kūrimi gŏsari nīguchchala vaṭṭidīside
dūri nīvĕṁtesi duṁḍagālāḍeve

(||vina||)
viṁduvalĕ moviichchi viḍĕmu sedi kiyyam̐gā
saṁdaḍiṁ sādani nĕṁtajaṁkiṁcheve
kaṁduvanuṁḍi pĕnam̐gi kām̐giliṁchugŏnam̐gānu
maṁdĕmeḽamuna nĕḍu mārugŏneve

(||vina||)
iṁṭilo śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ ninnum̐ gūḍam̐gānu
aṁṭimuṭṭi radi nĕṁta ala̮iṁcheve
naṁṭuna sĕlavulanu navvulĕllā navvam̐gānu
daṁṭavai kammaḍinela tamagiṁcheve