Vinanemi dappiboya venagamumdu vaasimte

విననేమి దప్పిపోయ వెనకముందు వాసింతే
Language

(॥పల్లవి॥)
విననేమి దప్పిపోయ వెనకముందు వాసింతే
మానిని నెక్కుడు సేసేమన్న నింతే కలది

(॥విన॥)
పంతము విడువనిదె పడఁతికి వుచితము
చెంతనుండి యేల గాసిసేసేవయ్యా
వంతుకువంతుకు సరివలపులు మీలోన
ఇంతితో ముందు మాటాడు టిదియే కలది

(॥విన॥)
చలము సాదించుకొంటే సతులకు వుచితము
పలుకుఁ బంతానకేల పారేవయ్య
బలిమి మీఇద్దరికి పాయ మొక్కకొలఁదే
యెలజవ్వని నవ్వించు టెక్కు డింతే కలది

(॥విన॥)
సిగ్గువడివుండేది చెలియకు నుచితము
యెగ్గుదప్పు లిందేల యెంచేవయ్య
కగ్గని శ్రీవేంకటేశ కాఁగి లిద్దరి కొక్కటే
వెగ్గళ మాకెకుఁ జేసేవిభవమే కలది

(||pallavi||)
vinanemi dappiboya vĕnagamuṁdu vāsiṁte
mānini nĕkkuḍu sesemanna niṁte kaladi

(||vina||)
paṁtamu viḍuvanidĕ paḍam̐tigi vusidamu
sĕṁtanuṁḍi yela gāsisesevayyā
vaṁtuguvaṁtugu sarivalabulu mīlona
iṁtido muṁdu māḍāḍu ṭidiye kaladi

(||vina||)
salamu sādiṁchugŏṁṭe sadulagu vusidamu
palugum̐ baṁtānagela pārevayya
balimi mīiddarigi pāya mŏkkagŏlam̐de
yĕlajavvani navviṁchu ṭĕkku ḍiṁte kaladi

(||vina||)
sigguvaḍivuṁḍedi sĕliyagu nusidamu
yĕggudappu liṁdela yĕṁchevayya
kaggani śhrīveṁkaḍeśha kām̐gi liddari kŏkkaḍe
vĕggaḽa māgĕgum̐ jesevibhavame kaladi