Vinamgadave maa vinnabamu

వినఁగదవే మా విన్నపము
Language

(॥పల్లవి॥)
వినఁగదవే మా విన్నపము
గొనకొని యిద్దరూఁ గూడితి రిపుడూ

(॥॥)
చలములు గడకును సాదించఁగా
వలపు లెన్నటికే వనితా
అలుకల మోసము లవే పెంచఁగ
పలుకుల యమృతము పనిగొను టెపుడే

(॥॥)
కఱకఱితనమే కడు నెరపఁగా
సరస మెన్నటికే సకియా
మఱిగినచోటనే మంకు చూపఁ గా
మురిపెము తనెదుట ముంచుట యెపుడే

(॥॥)
వాటపు సిగ్గులే వడిగాఁ గొనఁగా
కూట మెన్నటికే కోమలి
యీటున శ్రీ వేంకటేశు నెనసితివి
మేటి గుఱుతులను మెఱయుట యెపుడే

(||pallavi||)
vinam̐gadave mā vinnabamu
gŏnagŏni yiddarūm̐ gūḍidi ribuḍū

(||||)
salamulu gaḍagunu sādiṁcham̐gā
valabu lĕnnaḍige vanidā
alugala mosamu lave pĕṁcham̐ga
palugula yamṛtamu panigŏnu ṭĕbuḍe

(||||)
kaṟagaṟidaname kaḍu nĕrabam̐gā
sarasa mĕnnaḍige sagiyā
maṟiginasoḍane maṁku sūbam̐ gā
muribĕmu tanĕduḍa muṁchuḍa yĕbuḍe

(||||)
vāḍabu siggule vaḍigām̐ gŏnam̐gā
kūḍa mĕnnaḍige komali
yīḍuna śhrī veṁkaḍeśhu nĕnasidivi
meḍi guṟudulanu mĕṟayuḍa yĕbuḍe