Vina vedugayyee naagu vesa niddari suddulu

విన వేడుకయ్యీ నాకు వెస నిద్దరి సుద్దులు
Language

(॥పల్లవి॥)
విన వేడుకయ్యీ నాకు వెస నిద్దరి సుద్దులు
మన సొక్కటై వుండే మఱి యెఱిఁగించరే

(॥॥)
వెలఁది తలఁపు లెల్లా వినెనా రమణుఁడు
చెలులతోఁ బరాకు సేయఁడుగదా
తలఁపులు తలఁపులు తారుకాణ వచ్చెనా
చెలికత్తెనే నేనూఁ జెప్పరే మీరు

(॥॥)
పడఁతిచే కానుక పట్టి నా చేయి చాఁచి
అడియాలాలు మఱస్తి ననఁడుగదా
బడినుండియాతని విభావము దెలిసితిరా
చిడిముడి పడకుండాఁ జెప్పరే మీరు

(॥॥)
చేరియాకెఁ గూడేనా శ్రీ వేంకటేశ్వరుఁడు
జీరగాఁగఁ గొనగోరఁ జిమ్మఁడుగదా
ఆరితేరి యిద్దరిని అడిగితిరా నేఁడు
చేరువ సంతోసాలు చెప్పరే మీరు

(||pallavi||)
vina veḍugayyī nāgu vĕsa niddari suddulu
mana sŏkkaḍai vuṁḍe maṟi yĕṟim̐giṁchare

(||||)
vĕlam̐di talam̐pu lĕllā vinĕnā ramaṇum̐ḍu
sĕluladom̐ barāgu seyam̐ḍugadā
talam̐pulu talam̐pulu tārugāṇa vachchĕnā
sĕligattĕne nenūm̐ jĕppare mīru

(||||)
paḍam̐tise kānuga paṭṭi nā seyi sām̐si
aḍiyālālu maṟasti nanam̐ḍugadā
baḍinuṁḍiyādani vibhāvamu dĕlisidirā
siḍimuḍi paḍaguṁḍām̐ jĕppare mīru

(||||)
seriyāgĕm̐ gūḍenā śhrī veṁkaḍeśhvarum̐ḍu
jīragām̐gam̐ gŏnagoram̐ jimmam̐ḍugadā
ārideri yiddarini aḍigidirā nem̐ḍu
seruva saṁtosālu sĕppare mīru