Vina vedugayyee maagu vimtalaina mee suddulu

విన వేడుకయ్యీ మాకు వింతలైన మీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
విన వేడుకయ్యీ మాకు వింతలైన మీ సుద్దులు
యెనలేని ముచ్చటలు యెటువంటివో

(॥॥)
యెంగిలిపెదవి వంచి ఇందాఁకా నీ చేతిలోన-
నంగవించి మాటలాడె నది యెవ్వతో
పొంగుచు నీ మేన నిట్టె పులకలు గడునిండె
సంగతి న వెటువంటిసంతోసములో

(॥॥)
చెమటచన్నులు దాఁక చేలాగు నీకు నిచ్చి
అమర లోనికిఁ దెచ్చె నది యెవ్వతో
తమితోఁ గళలు రేఁగి తతి నివ్వెర గైతివి
సమమైన వెటువంటిసంగడిపొందులో

(॥॥)
జవ్వనమదము గార సదమదముగ నిన్ను
అవ్వలఁ గాఁగిటఁ గూడె నది యెవ్వతో
ఇవ్వల శ్రీ వేంకటేశ ఇటు నన్ను నేలితివి
వువ్విళ్లూర నెటువంటి వుపాయములో

(||pallavi||)
vina veḍugayyī māgu viṁtalaina mī suddulu
yĕnaleni muchchaḍalu yĕḍuvaṁṭivo

(||||)
yĕṁgilibĕdavi vaṁchi iṁdām̐kā nī sedilona-
naṁgaviṁchi māḍalāḍĕ nadi yĕvvado
pŏṁgusu nī mena niṭṭĕ pulagalu gaḍuniṁḍĕ
saṁgadi na vĕḍuvaṁṭisaṁtosamulo

(||||)
sĕmaḍasannulu dām̐ka selāgu nīgu nichchi
amara lonigim̐ dĕchchĕ nadi yĕvvado
tamidom̐ gaḽalu rem̐gi tadi nivvĕra gaidivi
samamaina vĕḍuvaṁṭisaṁgaḍibŏṁdulo

(||||)
javvanamadamu gāra sadamadamuga ninnu
avvalam̐ gām̐giḍam̐ gūḍĕ nadi yĕvvado
ivvala śhrī veṁkaḍeśha iḍu nannu nelidivi
vuvviḽlūra nĕḍuvaṁṭi vubāyamulo