Vimtivo vinavo kaani vedugado nunnadaana

వింటివో వినవో కాని వేడుకతో నున్నదాన
Language

(॥పల్లవి॥)
వింటివో వినవో కాని వేడుకతో నున్నదాన
జంటయై యుండఁగా నిన్ను జరయుచుందాన

(॥॥)
మలసి యెప్పుడు నీతో మాటలాడుదునో యని
మొలచినట్టి తమకమున నుందాన
యెలమి నీ వూడిగెములెన్నఁడు సేతునో యని
చెలరేఁగి తపములు సేయుచుందాన

(॥॥)
ననిచి యేవేళ నీతో నవ్వులు నవ్వేనో యని
కొనసాగే కోరికలు కోరుచుందాన
చనవుతో నీరూపు యెచ్చటఁ జూతువో యని
దినదినము యాసల దివురుచుందాన

(॥॥)
కందువ నెచ్చోట నిన్నుఁ గాఁగిలింతునో యని
విందుల వలపు విన్నవింపుచుందాన
చెంది నన్నుఁ గూడితివి శ్రీవేంకటేశుఁడ
యిందుకే నీపై బత్తి నిట్లుందాన

(||pallavi||)
viṁṭivo vinavo kāni veḍugado nunnadāna
jaṁṭayai yuṁḍam̐gā ninnu jarayusuṁdāna

(||||)
malasi yĕppuḍu nīdo māḍalāḍuduno yani
mŏlasinaṭṭi tamagamuna nuṁdāna
yĕlami nī vūḍigĕmulĕnnam̐ḍu seduno yani
sĕlarem̐gi tabamulu seyusuṁdāna

(||||)
nanisi yeveḽa nīdo navvulu navveno yani
kŏnasāge korigalu korusuṁdāna
sanavudo nīrūbu yĕchchaḍam̐ jūduvo yani
dinadinamu yāsala divurusuṁdāna

(||||)
kaṁduva nĕchchoḍa ninnum̐ gām̐giliṁtuno yani
viṁdula valabu vinnaviṁpusuṁdāna
sĕṁdi nannum̐ gūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa
yiṁduge nībai batti niṭluṁdāna