వింటివా వోయి నీ వీనులు చల్లఁగాను
(॥పల్లవి॥)
వింటివా వోయి నీ వీనులు చల్లఁగాను
నంటున వెూములు చూచి నవ్వులు నవ్వేరు
(॥వింటి॥)
మచ్చికతో నీవు నన్ను మన్నించిన సుద్దులెల్ల
అచ్చపు సవతులెల్ల నాడుకొనేరు
పచ్చిగా నీవు నాతోఁ బలికిన పలుకులు
రచ్చల నందరిలోన రాఁపు సేసేరు
(॥వింటి॥)
గోరికొన నంటి నీవు కొసరి వేఁడుకొనఁగ
చేరి తమలో సన్నలు సేసుకొనేరు
సారెకు నీవు నాతో సరసములాడినవి
కోరి వెల్లావిరులుగా గురులు సేసేరు
(॥వింటి॥)
కందువ నీవు నన్నుఁ గాఁగిటఁ గూడినట్టి
పొందులు యెలుఁగులెత్తి పొగడేరు
అందరి శ్రీవేంకటేశ అంకెల నీవేలినది
విందుల వేడుకలతో వెలయించేరు
(||pallavi||)
viṁṭivā voyi nī vīnulu sallam̐gānu
naṁṭuna vĕూmulu sūsi navvulu navveru
(||viṁṭi||)
machchigado nīvu nannu manniṁchina suddulĕlla
achchabu savadulĕlla nāḍugŏneru
pachchigā nīvu nādom̐ baligina palugulu
rachchala naṁdarilona rām̐pu seseru
(||viṁṭi||)
gorigŏna naṁṭi nīvu kŏsari vem̐ḍugŏnam̐ga
seri tamalo sannalu sesugŏneru
sārĕgu nīvu nādo sarasamulāḍinavi
kori vĕllāvirulugā gurulu seseru
(||viṁṭi||)
kaṁduva nīvu nannum̐ gām̐giḍam̐ gūḍinaṭṭi
pŏṁdulu yĕlum̐gulĕtti pŏgaḍeru
aṁdari śhrīveṁkaḍeśha aṁkĕla nīvelinadi
viṁdula veḍugalado vĕlayiṁcheru