Vimtivaa vo seliya naa vinnabamulu

వింటివా వో చెలియ నా విన్నపములు
Language

(॥పల్లవి॥)
వింటివా వో చెలియ నా విన్నపములు
కంటివిగదె తారుకాణ లన్నియును

(॥వింటి॥)
మెచ్చనేర్చినవానిపై మేలు సేసెదె తపము
అచ్చపుగుణముగ యాఁటదానికి
కచ్చుపట్టి యందులోనె కలుగు నిహపరాలు
చెచ్చెరఁ గాఁపురము సేయనేర్చినను

(॥వింటి॥)
యితవెరిఁగినపతి యిన్నిటా మూలధనము
చతురత సేవసేసేజవరాలికి
తతివచ్చినప్పుడు తానే ఘలియించు
మితిలేనివినయాన మెలఁగనేర్చినను

(॥వింటి॥)
కలసేశ్రీవేంకటేశు కాఁగిలే రాజ్యపదవి
అలమేల్మంగవు నీయట్టిదానికి
వెల లేనివేడు కెల్లా విచారించితే నీదే
తలపోసుకొని పొందు దగులనేర్చినను

(||pallavi||)
viṁṭivā vo sĕliya nā vinnabamulu
kaṁṭivigadĕ tārugāṇa lanniyunu

(||viṁṭi||)
mĕchchanersinavānibai melu sesĕdĕ tabamu
achchabuguṇamuga yām̐ṭadānigi
kachchubaṭṭi yaṁdulonĕ kalugu nihabarālu
sĕchchĕram̐ gām̐puramu seyanersinanu

(||viṁṭi||)
yidavĕrim̐ginabadi yinniḍā mūladhanamu
sadurada sevasesejavarāligi
tadivachchinappuḍu tāne ghaliyiṁchu
midilenivinayāna mĕlam̐ganersinanu

(||viṁṭi||)
kalaseśhrīveṁkaḍeśhu kām̐gile rājyabadavi
alamelmaṁgavu nīyaṭṭidānigi
vĕla leniveḍu kĕllā visāriṁchide nīde
talabosugŏni pŏṁdu dagulanersinanu