Vimtirade selulaara vimtasuddi idogadi

వింటిరటే చెలులార వింతసుద్ది ఇదొకటి
Language

(॥పల్లవి॥)
వింటిరటే చెలులార వింతసుద్ది ఇదొకటి
వొంటి నీచేఁతలు చూచుకుందాన నేను

(॥॥)
శిరసు మజ్జనమాడి చిక్కుదీసుకొనఁ గాను
సరుసనున్నాకెఁ దాఁకె సన్నపుగోరు
సిరుల నితఁడు సన్న సేసెనంటా నాకె వచ్చి
సొరిదిఁ గాఁగిలించితే చూచి నవ్వె నితడు

(॥॥)
బలుసొమ్ములు నించుక పరిమళాలు పూయఁ గ
చెలియొకతెపై బొట్టు చిమ్మిపడెను
కలయకకు గురుతు గావించెనంటా వచ్చి
మలసి మోము చూచితే మరినవ్వెనితఁ డు

(॥॥)
అట్టె శ్రీ వేంకటేశుడు అలమేల్మంగఁ గూడఁగా
కట్టఁగడాకెఁ దాఁకె గక్కనఁ బాదము
ఇట్టె తానుఁ బెండ్లాడ యెచ్చరించెనంటా వచ్చి
యెట్టయెదుట నిల్చితే యెనసి తా నవ్వెను

(||pallavi||)
viṁṭiraḍe sĕlulāra viṁtasuddi idŏgaḍi
vŏṁṭi nīsem̐talu sūsuguṁdāna nenu

(||||)
śhirasu majjanamāḍi sikkudīsugŏnam̐ gānu
sarusanunnāgĕm̐ dām̐kĕ sannabugoru
sirula nidam̐ḍu sanna sesĕnaṁṭā nāgĕ vachchi
sŏridim̐ gām̐giliṁchide sūsi navvĕ nidaḍu

(||||)
balusŏmmulu niṁchuga parimaḽālu pūyam̐ ga
sĕliyŏgadĕbai bŏṭṭu simmibaḍĕnu
kalayagagu gurudu gāviṁchĕnaṁṭā vachchi
malasi momu sūside marinavvĕnidam̐ ḍu

(||||)
aṭṭĕ śhrī veṁkaḍeśhuḍu alamelmaṁgam̐ gūḍam̐gā
kaṭṭam̐gaḍāgĕm̐ dām̐kĕ gakkanam̐ bādamu
iṭṭĕ tānum̐ bĕṁḍlāḍa yĕchchariṁchĕnaṁṭā vachchi
yĕṭṭayĕduḍa nilside yĕnasi tā navvĕnu