వింటిరటే చెలులాల వేడుక సంతోసవార్త
(॥పల్లవి॥)
వింటిరటే చెలులాల వేడుక సంతోసవార్త
యింట నింట వూరనెల్ల యిదే సుద్ది
(॥॥)
కోమలి దేవకిదేవి కొడుకుఁ గంటే రేపల్లెఁ
బ్రేమతో వసుదేవుఁడు పెంచఁబెట్టి వచ్చెనట
గామిడై యశోదకూఁతుఁ గంసునికిఁ జూపెనట
ఆమగువ కంసుని నద్దలించినదట
(॥॥)
శ్రావణ బహుళాష్ణుఁమి సవరేతిరికాడను
ఆవేళ రోహిణి మంచిదైనపొద్దూనట
కావింప మేనమామకు గండమట యీతఁడే
దేవరట బాఁప లెల్లా దిక్కులఁ జెప్పిరి
(॥॥)
యిటమీఁద రాకాసుల నిందరిఁ గొట్టెనట
ఘటన సాధులనెల్లాఁ గరుణ రక్షించెనట
పటుగతి వీఁడు శ్రీ వేంకటగిరికృష్ణుఁడట
నటించునల మేల్మంగనాయఁకుడు దానట
(||pallavi||)
viṁṭiraḍe sĕlulāla veḍuga saṁtosavārda
yiṁṭa niṁṭa vūranĕlla yide suddi
(||||)
komali devagidevi kŏḍugum̐ gaṁṭe reballĕm̐
bremado vasudevum̐ḍu pĕṁcham̐bĕṭṭi vachchĕnaḍa
gāmiḍai yaśhodagūm̐tum̐ gaṁsunigim̐ jūbĕnaḍa
āmaguva kaṁsuni naddaliṁchinadaḍa
(||||)
śhrāvaṇa bahuḽāṣhṇum̐mi savaredirigāḍanu
āveḽa rohiṇi maṁchidainabŏddūnaḍa
kāviṁpa menamāmagu gaṁḍamaḍa yīdam̐ḍe
devaraḍa bām̐pa lĕllā dikkulam̐ jĕppiri
(||||)
yiḍamīm̐da rāgāsula niṁdarim̐ gŏṭṭĕnaḍa
ghaḍana sādhulanĕllām̐ garuṇa rakṣhiṁchĕnaḍa
paḍugadi vīm̐ḍu śhrī veṁkaḍagirikṛṣhṇum̐ḍaḍa
naḍiṁchunala melmaṁganāyam̐kuḍu dānaḍa