Vimtiraa vo selulaalaa vibhuni tagavulellaa

వింటిరా వో చెలులాలా విభుని తగవులెల్లా
Language

(॥పల్లవి॥)
వింటిరా వో చెలులాలా విభుని తగవులెల్లా
దంట తన సరితలు తా నెఱఁగఁడా

(॥వింటి॥)
మొగము చూచినవాఁడు మోహమే పైఁ జల్లుఁగాక
చిగురుఁ జేఁతల తోడి సిగ్గు లే
నగితిఁబో నే నందుకు నన్నడుగ నిఁకనేల
తగుఁ దనవొళ్లికల్ల తా నెఱఁగఁడా

(॥వింటి॥)
యిచ్చకమాడేటివాఁడు యేమనినా వినుఁగాక
వచ్చి వచ్చి తానే తలవంచనేల
యెచ్చరించితిఁబో నేను ఇందుకుఁ దానననేల
తచ్చితే నాకాఁపిరము తానెఱఁగఁడా

(॥వింటి॥)
కాఁగిలించు కొన్నవాఁడు కడుఁదమకించుఁగాక
వీఁగనియాసలతో నివ్వెరగులేల
ఆఁగుచు శ్రీ వేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
దాఁగని తన మహిమ తా నెఱఁగడా

(||pallavi||)
viṁṭirā vo sĕlulālā vibhuni tagavulĕllā
daṁṭa tana saridalu tā nĕṟam̐gam̐ḍā

(||viṁṭi||)
mŏgamu sūsinavām̐ḍu mohame paim̐ jallum̐gāga
sigurum̐ jem̐tala toḍi siggu le
nagidim̐bo ne naṁdugu nannaḍuga nim̐kanela
tagum̐ danavŏḽligalla tā nĕṟam̐gam̐ḍā

(||viṁṭi||)
yichchagamāḍeḍivām̐ḍu yemaninā vinum̐gāga
vachchi vachchi tāne talavaṁchanela
yĕchchariṁchidim̐bo nenu iṁdugum̐ dānananela
tachchide nāgām̐piramu tānĕṟam̐gam̐ḍā

(||viṁṭi||)
kām̐giliṁchu kŏnnavām̐ḍu kaḍum̐damagiṁchum̐gāga
vīm̐ganiyāsalado nivvĕragulela
ām̐gusu śhrī veṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
dām̐gani tana mahima tā nĕṟam̐gaḍā