Vimtimi yee kottalu veenulu sallamgaanu

వింటిమి యీ కొత్తలు వీనులు చల్లఁగాను
Language

(॥పల్లవి॥)
వింటిమి యీ కొత్తలు వీనులు చల్లఁగాను
జంటలై నీపై వలపు చల్లెనట చెలియ

(॥॥)
వేడుకలు వెదచల్లి వీడెము పుక్కిటఁ బెట్టి
ఆడరానిమాట లాపె ఆడెనట
కోడెకాఁడవై నీవు కొండగొడగెత్తఁగాను
నీడనుండే చెమటలు నించెనట చెలియ

(॥॥)
చిప్పిల నవ్వులు నవ్వి చేతులు బుజాల వేసి
చెప్పరానిసేఁత లాపె చేసెనట
గొప్పలుగా నీవు పిల్లఁగోవి రాగా లొత్తఁగాను
దెప్పరాన నలపెల్లా దేరేనట చెలియ

(॥॥)
చాయలు సన్నలు చూసి చన్ను లురమున నాని
సేయరాని సేవ లాపె చేకొనెనట
యీయెడ శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
మోయరానిచోటు మోపి మొక్కెనట చెలియ

(||pallavi||)
viṁṭimi yī kŏttalu vīnulu sallam̐gānu
jaṁṭalai nībai valabu sallĕnaḍa sĕliya

(||||)
veḍugalu vĕdasalli vīḍĕmu pukkiḍam̐ bĕṭṭi
āḍarānimāḍa lābĕ āḍĕnaḍa
koḍĕgām̐ḍavai nīvu kŏṁḍagŏḍagĕttam̐gānu
nīḍanuṁḍe sĕmaḍalu niṁchĕnaḍa sĕliya

(||||)
sippila navvulu navvi sedulu bujāla vesi
sĕpparānisem̐ta lābĕ sesĕnaḍa
gŏppalugā nīvu pillam̐govi rāgā lŏttam̐gānu
dĕpparāna nalabĕllā derenaḍa sĕliya

(||||)
sāyalu sannalu sūsi sannu luramuna nāni
seyarāni seva lābĕ segŏnĕnaḍa
yīyĕḍa śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
moyarānisoḍu mobi mŏkkĕnaḍa sĕliya