వింటిమి మీ కతలెల్లా వీనుల పండుగగాను
(॥పల్లవి॥)
వింటిమి మీ కతలెల్లా వీనుల పండుగగాను
ఇంటిటా మీ గుణా లెన్నుకొనే రిందరు
(॥వింటి॥)
మనసుగరగ నీతో మాటలాడనేర్పు నాపె
ననుపు సేసుక మరి నవ్వనోపును
పనిమాలినపనికి భ్రమతువు నీవును
అనిశము మీసుద్దులే ఆడుకొనే రిందరు
(॥వింటి॥)
బత్తిచేసి వద్దనుండి పాదాలు విసుకు నాపె
హత్తి నీకూడిగాలు సేయఁగనోపును
కొత్తకొత్తవలపులే కోరుదువు నీవును
పొత్తుల మీపొందు తలపోసుకొనే రిందరు
(॥వింటి॥)
తగిలి సారెకు రతిఁ దమిరేఁచగల దాపె
జిగిమీర నీకు బుద్దిచెప్పనోపును
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
మిగులా మీతగవులే మెచ్చే రిందరు
(||pallavi||)
viṁṭimi mī kadalĕllā vīnula paṁḍugagānu
iṁṭiḍā mī guṇā lĕnnugŏne riṁdaru
(||viṁṭi||)
manasugaraga nīdo māḍalāḍanerbu nābĕ
nanubu sesuga mari navvanobunu
panimālinabanigi bhramaduvu nīvunu
aniśhamu mīsuddule āḍugŏne riṁdaru
(||viṁṭi||)
battisesi vaddanuṁḍi pādālu visugu nābĕ
hatti nīgūḍigālu seyam̐ganobunu
kŏttagŏttavalabule koruduvu nīvunu
pŏttula mībŏṁdu talabosugŏne riṁdaru
(||viṁṭi||)
tagili sārĕgu radim̐ damirem̐sagala dābĕ
jigimīra nīgu buddisĕppanobunu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
migulā mīdagavule mĕchche riṁdaru