వింటిమి కంటిమి తన వేడుకకారితనాలు
(॥పల్లవి॥)
వింటిమి కంటిమి తన వేడుకకారితనాలు
ఇంటిలోనఁ దన నేమా లెచ్చరించనేఁటికే
(॥వింటి॥)
చుట్టమైనవాఁడు నాకు సొమ్ములందినట్టివాఁడు
అట్టె సుద్దు లేమిచెప్పీ నాడనే వుండి
బట్టబయలుగఁ దనభావము దెలుపుఁగాక
గుట్టుతోడ సిగ్గులెల్లాఁ గుప్ప సేయనేఁటికే
(॥వింటి॥)
తలఁపెఱిఁగినవాఁడు దయగలిగినవాఁడు
వలపు లేమి చల్లీని వాకిటనుండి
తళుకొత్త నా మోము తప్పక చూచుఁగాక
మొలకనవ్వులు లోలో మోపుగట్టనేఁటికే
(॥వింటి॥)
సేసవెట్టినట్టివాఁడు చెలిమిసేసినవాఁడు
బాసలేమి సేసీని పాన్పుపైనుండి
వాసితో శ్రీవేంకటాద్రివరుఁడు తా నన్నుఁ గూడె
వేసాలతననిజాలు వెదవెట్టనేఁటికే
(||pallavi||)
viṁṭimi kaṁṭimi tana veḍugagāridanālu
iṁṭilonam̐ dana nemā lĕchchariṁchanem̐ṭige
(||viṁṭi||)
suṭṭamainavām̐ḍu nāgu sŏmmulaṁdinaṭṭivām̐ḍu
aṭṭĕ suddu lemisĕppī nāḍane vuṁḍi
baṭṭabayalugam̐ danabhāvamu dĕlubum̐gāga
guṭṭudoḍa siggulĕllām̐ guppa seyanem̐ṭige
(||viṁṭi||)
talam̐pĕṟim̐ginavām̐ḍu dayagaliginavām̐ḍu
valabu lemi sallīni vāgiḍanuṁḍi
taḽugŏtta nā momu tappaga sūsum̐gāga
mŏlaganavvulu lolo mobugaṭṭanem̐ṭige
(||viṁṭi||)
sesavĕṭṭinaṭṭivām̐ḍu sĕlimisesinavām̐ḍu
bāsalemi sesīni pānpubainuṁḍi
vāsido śhrīveṁkaḍādrivarum̐ḍu tā nannum̐ gūḍĕ
vesāladananijālu vĕdavĕṭṭanem̐ṭige