Vimtimi kamtimi naamde veenulam gannulanu

వింటిమి కంటిమి నాఁడే వీనులఁ గన్నులను
Language

(॥పల్లవి॥)
వింటిమి కంటిమి నాఁడే వీనులఁ గన్నులను
సొంటులు సోదించవద్దు జొబ్బిలీఁ జెమటలు

(॥వింటి॥)
చొప్పెలెత్తి పలుమారుఁ జూచితి నన్నియు నిట్టె
కప్పవద్దు నీచేఁతలు కల్లలు గావు
వుప్పటించెనననేవు నిన్నూరక నే నేమనినా
చెప్పవద్దు నీసుద్దులు చెల్లుబడులాయను

(॥వింటి॥)
బట్టబయటఁ బడెను పట్టితి మి మ్మిద్దరిని
గుట్టుసేయ నిఁక వద్దు గురుతు లివే
బెట్టుగా మోవికెంపులు బేట్లెత్తి నేఁజూపితి
ముట్టవద్దు నన్ను నీవు మునివేళ్లు చాఁచి

(॥వింటి॥)
దివ్వెవెలుఁగుననే తేటపడె నీకూటమి
నవ్వవద్దు నీ వంతేసి నయగారాల
రవ్వగా శ్రీవేంకటేశ రతి నిన్నుఁ జేసితిని
దువ్వవద్దు నాకొప్పు దొరకె వేడుకలు

(||pallavi||)
viṁṭimi kaṁṭimi nām̐ḍe vīnulam̐ gannulanu
sŏṁṭulu sodiṁchavaddu jŏbbilīm̐ jĕmaḍalu

(||viṁṭi||)
sŏppĕlĕtti palumārum̐ jūsidi nanniyu niṭṭĕ
kappavaddu nīsem̐talu kallalu gāvu
vuppaḍiṁchĕnananevu ninnūraga ne nemaninā
sĕppavaddu nīsuddulu sĕllubaḍulāyanu

(||viṁṭi||)
baṭṭabayaḍam̐ baḍĕnu paṭṭidi mi mmiddarini
guṭṭuseya nim̐ka vaddu gurudu live
bĕṭṭugā movigĕṁpulu beṭlĕtti nem̐jūbidi
muṭṭavaddu nannu nīvu muniveḽlu sām̐si

(||viṁṭi||)
divvĕvĕlum̐gunane teḍabaḍĕ nīgūḍami
navvavaddu nī vaṁtesi nayagārāla
ravvagā śhrīveṁkaḍeśha radi ninnum̐ jesidini
duvvavaddu nāgŏppu dŏragĕ veḍugalu