వింటిమే నీ చేఁతులు వీనుల పండువగాను
(॥పల్లవి॥)
వింటిమే నీ చేఁతులు వీనుల పండువగాను
కంటిమే మీ వొద్దికలు కన్నులు చల్లఁగాను
(॥వింటి॥)
నీటుకత్తెవు నౌదువు నేరుపరివి నౌదువు
మాటలాడ వలఁతివే మగనితోను
పాటించి యాతని నీవు పక్కవాయనీయవు
మేటిసతులెల్లాను మెచ్చేరే నిన్నును
(॥వింటి॥)
దొరవూ నీ వౌదువే దొడ్డదాన వౌదువే
బిరుదు గట్టుక వలపించాఁగలవే
యెరవులేక యేపొద్దూ యింటఁ బెట్టుకుందానవు
పొరుగిరుగులవారు పొగడేరు నిన్నును
(॥వింటి॥)
పంతగతైవు నౌదువే బలుదాన వౌదువే
వింతలుగాఁ గూడి పొందు వెలయింతువే
ఇంతలోనె శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁగూడె
ఇంతులెల్లా సంతోసాన నెంచేరు నిన్నును
(||pallavi||)
viṁṭime nī sem̐tulu vīnula paṁḍuvagānu
kaṁṭime mī vŏddigalu kannulu sallam̐gānu
(||viṁṭi||)
nīḍugattĕvu nauduvu nerubarivi nauduvu
māḍalāḍa valam̐tive maganidonu
pāḍiṁchi yādani nīvu pakkavāyanīyavu
meḍisadulĕllānu mĕchchere ninnunu
(||viṁṭi||)
dŏravū nī vauduve dŏḍḍadāna vauduve
birudu gaṭṭuga valabiṁchām̐galave
yĕravulega yebŏddū yiṁṭam̐ bĕṭṭuguṁdānavu
pŏrugirugulavāru pŏgaḍeru ninnunu
(||viṁṭi||)
paṁtagadaivu nauduve baludāna vauduve
viṁtalugām̐ gūḍi pŏṁdu vĕlayiṁtuve
iṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐gūḍĕ
iṁtulĕllā saṁtosāna nĕṁcheru ninnunu