Vimtimayyaa nemdu nee vedigelu

వింటిమయ్యా నేఁడు నీ వేడికెలు
Language

(॥పల్లవి॥)
వింటిమయ్యా నేఁడు నీ వేడికెలు
కంటిమయ్యా తోడుతనే కందువ వాడికెలు

(॥॥)
వలపుల తమ్మివిరివాటులు
సొలపులఁ బెనఁగినచోటులు
నెలకొని వున్న నీనీటులు
కొలువులో సుద్దులివి కొండలుఁ గోటులు

(॥॥)
వెల్లవిరిచూపుల నీవీడేలు
మెల్లనె తమకముల మేడేలు
కొల్లలు నీతమకపుగూడేలు
పెల్లురేఁగెఁ బుక్కిళ్ళ పెండ్లివీడేలు

(॥॥)
పాలకూళ్ళలోననె పంతాలు
చాలా నమరె నీసంతాలు
యేలితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
యీలీల నాతో నాడేవు యేకాంతాలు

(||pallavi||)
viṁṭimayyā nem̐ḍu nī veḍigĕlu
kaṁṭimayyā toḍudane kaṁduva vāḍigĕlu

(||||)
valabula tammivirivāḍulu
sŏlabulam̐ bĕnam̐ginasoḍulu
nĕlagŏni vunna nīnīḍulu
kŏluvulo suddulivi kŏṁḍalum̐ goḍulu

(||||)
vĕllavirisūbula nīvīḍelu
mĕllanĕ tamagamula meḍelu
kŏllalu nīdamagabugūḍelu
pĕllurem̐gĕm̐ bukkiḽḽa pĕṁḍlivīḍelu

(||||)
pālagūḽḽalonanĕ paṁtālu
sālā namarĕ nīsaṁtālu
yelidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
yīlīla nādo nāḍevu yegāṁtālu