Vimti midigo nemu veenula pamduvagaanu

వింటి మిదిగో నేము వీనుల పండువగాను
Language

(॥పల్లవి॥)
వింటి మిదిగో నేము వీనుల పండువగాను
వింటేకాదు కన్నులారఁ గంటిమి నీ చేఁతలు

(॥వింటి॥)
చెలులెల్ల నాడానీడాఁ జేప్పుకొనేరు సుద్దులు
వలనుగ వేగిరమే వలతువంటా
నలిరేఁగి తమలొన నవ్వేరు జవరాండ్లు
పిలిచితే లొనౌదువు పెనఁగవంటాను

(॥వింటి॥)
సవసవఁగా నింతులు సన్నలుసేసుకొనేరు
వువిదలమాటల వొర్తువంటాను
తివిరి మొకమొకాలు తేరకోఁజూచుకొనేరు
కవగూడి చెనకితేఁ గరఁగుదువంటాను

(॥వింటి॥)
వేడుకతో నీదిక్కు వేళ్లనే చూపుకొనేరు
యిడుజొడై నీవు తమ్ము నేలితివంటా
పాడితో నలమేల్‌మంగపతి శ్రీవేంకటేశ్వర
వాడిక నన్నుఁ బెండ్లాడి వసమైతివంటాను

(||pallavi||)
viṁṭi midigo nemu vīnula paṁḍuvagānu
viṁṭegādu kannulāram̐ gaṁṭimi nī sem̐talu

(||viṁṭi||)
sĕlulĕlla nāḍānīḍām̐ jeppugŏneru suddulu
valanuga vegirame valaduvaṁṭā
nalirem̐gi tamalŏna navveru javarāṁḍlu
piliside lŏnauduvu pĕnam̐gavaṁṭānu

(||viṁṭi||)
savasavam̐gā niṁtulu sannalusesugŏneru
vuvidalamāḍala vŏrduvaṁṭānu
tiviri mŏgamŏgālu teragom̐jūsugŏneru
kavagūḍi sĕnagidem̐ garam̐guduvaṁṭānu

(||viṁṭi||)
veḍugado nīdikku veḽlane sūbugŏneru
yiḍujŏḍai nīvu tammu nelidivaṁṭā
pāḍido nalamel‌maṁgabadi śhrīveṁkaḍeśhvara
vāḍiga nannum̐ bĕṁḍlāḍi vasamaidivaṁṭānu