వింటి దన సుద్దులెల్ల వింతలా నాకు
(॥పల్లవి॥)
వింటి దన సుద్దులెల్ల వింతలా నాకు
దంటతనాలకు గురి తానే కాఁడా
(॥వింటి॥)
చొప్పు మాయ దొల్లియును సుదతులయెడలను
తప్పని బొంకని వాడు తానే కాడా
వుప్పతిల్లుఁ జెమటల యుదధిలో నుండినాను
దప్పి దేరిచేవాఁడు తానే కాడా
(॥వింటి॥)
గొరబుగా నింతులకు కోరిన కోరికలియ్యఁ
దరమెరిగినవాఁడు తానే కాఁడా
విరహపుటేటిలోన వెలఁదుల నీఁదించి
దరినుండి నవ్వేవాఁడు తానే కాఁడా
(॥వింటి॥)
అగపడి యందరికి నన్నిరూపులై తనిపి
తగవు దేర్చినవాఁడు తానే కాఁడా
నగి శ్రీవేంకటేశుఁడు నాకాఁగిటి కొలనిలోఁ
దగ నోలలాడువాఁడు తానే కాఁడా
(||pallavi||)
viṁṭi dana suddulĕlla viṁtalā nāgu
daṁṭadanālagu guri tāne kām̐ḍā
(||viṁṭi||)
sŏppu māya dŏlliyunu sudadulayĕḍalanu
tappani bŏṁkani vāḍu tāne kāḍā
vuppadillum̐ jĕmaḍala yudadhilo nuṁḍinānu
dappi derisevām̐ḍu tāne kāḍā
(||viṁṭi||)
gŏrabugā niṁtulagu korina korigaliyyam̐
daramĕriginavām̐ḍu tāne kām̐ḍā
virahabuḍeḍilona vĕlam̐dula nīm̐diṁchi
darinuṁḍi navvevām̐ḍu tāne kām̐ḍā
(||viṁṭi||)
agabaḍi yaṁdarigi nannirūbulai tanibi
tagavu dersinavām̐ḍu tāne kām̐ḍā
nagi śhrīveṁkaḍeśhum̐ḍu nāgām̐giḍi kŏlanilom̐
daga nolalāḍuvām̐ḍu tāne kām̐ḍā