వింటే దయవుట్టి యిట్టె విచ్చేసీ నీడకు
(॥పల్లవి॥)
వింటే దయవుట్టి యిట్టె విచ్చేసీ నీడకు
యింటికిఁ దోడి తేరమ్మా యీకె ప్రాణేశ్వరుని
(॥॥)
చిత్తరుపటము చూచి సెలవుల నవ్వు నవ్వీ
తత్తరాన బాన్పుచూచి తలవంచీని
పొత్తులడపము చూచి పులకించీ మేనెల్లా
హత్తి విన్నవించరమ్మా అంగన విభునికి
(॥॥)
చేరి కేళాకూళి చూచి చింతతోడఁ దలపోసీ
పారువపుగుంపుఁ జూచి భ్రమసీని
కోరి పువ్వుటిల్లు చూచి కుప్పళించీఁ బెంజెమట
సారె నెరిఁగించరమ్మ సతినాయకునికి
(॥॥)
నిలువుటద్దము చూచి నివ్వెరగుతో నున్నది
చెలిక త్తెలనుఁ జూచి సిగ్గువడీని
కలసీఁ గాఁగిట దానె గక్కన నేతించి నేఁడు
చెలఁగి కానుకీరమ్మా శ్రీవేంకటేశునికి
(||pallavi||)
viṁṭe dayavuṭṭi yiṭṭĕ vichchesī nīḍagu
yiṁṭigim̐ doḍi terammā yīgĕ prāṇeśhvaruni
(||||)
sittarubaḍamu sūsi sĕlavula navvu navvī
tattarāna bānpusūsi talavaṁchīni
pŏttulaḍabamu sūsi pulagiṁchī menĕllā
hatti vinnaviṁcharammā aṁgana vibhunigi
(||||)
seri keḽāgūḽi sūsi siṁtadoḍam̐ dalabosī
pāruvabuguṁpum̐ jūsi bhramasīni
kori puvvuḍillu sūsi kuppaḽiṁchīm̐ bĕṁjĕmaḍa
sārĕ nĕrim̐giṁcharamma sadināyagunigi
(||||)
niluvuḍaddamu sūsi nivvĕragudo nunnadi
sĕliga ttĕlanum̐ jūsi sigguvaḍīni
kalasīm̐ gām̐giḍa dānĕ gakkana nediṁchi nem̐ḍu
sĕlam̐gi kānugīrammā śhrīveṁkaḍeśhunigi