వింతవింత వలపుల నిటుకులాఁడి
(॥పల్లవి॥)
వింతవింత వలపుల నిటుకులాఁడి
యింత యెమ్మెలు చూపీ నీకేమౌనయ్యా
(॥వింత॥)
నిక్కఁగొప్పుముడిచిననీలపుఁగురులయాపె
చెక్కుచెమటలతోడి సిగ్గులయాపె
ముక్కుపైవేలిడుకున్న ముసిముసినవ్వులాపె
ఇక్కడ నున్నది నీకు నేమౌనయ్యా
(॥వింత॥)
నెలఁత మాఁటున నుండి నీదిక్కేచూచేయాపె
కెలసి చిలుకఁ బలికించేయాపె
పెలుచుఁజేఁతలతోడి పెద్దపెద్దగోళ్లాపె
యెలుఁగెత్తి పాడీ నీకు నేమౌనయ్యా
(॥వింత॥)
పట్టెఁడేసిచన్నులుపచారించుకున్న యాపె
గట్టిగా నీపొందులకుఁ గాచుకున్నాపె
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
యిట్టె నిన్నుఁదా మెచ్చీ నీ కేమౌనయ్యా
(||pallavi||)
viṁtaviṁta valabula niḍugulām̐ḍi
yiṁta yĕmmĕlu sūbī nīgemaunayyā
(||viṁta||)
nikkam̐gŏppumuḍisinanīlabum̐gurulayābĕ
sĕkkusĕmaḍaladoḍi siggulayābĕ
mukkubaiveliḍugunna musimusinavvulābĕ
ikkaḍa nunnadi nīgu nemaunayyā
(||viṁta||)
nĕlam̐ta mām̐ṭuna nuṁḍi nīdikkesūseyābĕ
kĕlasi silugam̐ baligiṁcheyābĕ
pĕlusum̐jem̐taladoḍi pĕddabĕddagoḽlābĕ
yĕlum̐gĕtti pāḍī nīgu nemaunayyā
(||viṁta||)
paṭṭĕm̐ḍesisannulubasāriṁchugunna yābĕ
gaṭṭigā nībŏṁdulagum̐ gāsugunnābĕ
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
yiṭṭĕ ninnum̐dā mĕchchī nī kemaunayyā