Vimtavaarivallanaide vesaninnee sammadaunu

వింతవారివల్లనైతే వెసనిన్నీ సమ్మతౌను
Language

(॥పల్లవి॥)
వింతవారివల్లనైతే వెసనిన్నీ సమ్మతౌను
చెంతల నావల్లనైతే చిత్తమెట్టు వచ్చునో

(॥వింత॥)
తప్పకుండా నీ వొళ్లి తగవులే నెరపేవు
చెప్పరాదా నీమాట చెలులతోను
అప్పుడే వారె తెలిపే రౌఁగాములెల్లా నీకు
చిప్పిల నే నేమనినా చిత్తాన నెట్టుండునో

(॥వింత॥)
వోపికతో నీకునీవే వూరకే మెచ్చుకొనేవు
చూపరాదా నీ సేఁత సుదతులకు
రూపించేరు వారే నీనేరుపులెల్లా నొక్కమాఁటే
దీపించ నే నేర్పరచితే నేమందువో

(॥వింత॥)
నిలువఁబెట్టేవు నీ నిజములే పలుమారు
తెలుపరాదా నీవొద్దితెఱవలకు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వెలయ నేఁ గొసరితే వేడు కెంతవుట్టునో

(||pallavi||)
viṁtavārivallanaide vĕsaninnī sammadaunu
sĕṁtala nāvallanaide sittamĕṭṭu vachchuno

(||viṁta||)
tappaguṁḍā nī vŏḽli tagavule nĕrabevu
sĕpparādā nīmāḍa sĕluladonu
appuḍe vārĕ tĕlibe raum̐gāmulĕllā nīgu
sippila ne nemaninā sittāna nĕṭṭuṁḍuno

(||viṁta||)
vobigado nīgunīve vūrage mĕchchugŏnevu
sūbarādā nī sem̐ta sudadulagu
rūbiṁcheru vāre nīnerubulĕllā nŏkkamām̐ṭe
dībiṁcha ne nerbaraside nemaṁduvo

(||viṁta||)
niluvam̐bĕṭṭevu nī nijamule palumāru
tĕlubarādā nīvŏddidĕṟavalagu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vĕlaya nem̐ gŏsaride veḍu kĕṁtavuṭṭuno