వింతవారమా నేము విచారించుకొనవయ(య్య?)
(॥పల్లవి॥)
వింతవారమా నేము విచారించుకొనవయ(య్య?)
బంతి నున్నారు సతులు పాయని నీ కృపను
(॥వింత॥)
యెంతలేదు నీనవ్వు యెన్నిలేవు నీమాటలు
అంతటాను తనిసిరి యాఁడువారెల్లా
చింతదీర నీకు నేము సేవసేసేవారము
దొంతి నున్నది వలపు తొల్లె నీకృపను
(॥వింత॥)
యేమిసేసేవు నీయాన లెఱఁగమా మీబాసలు
దోమటిగాఁ దొడికిరి తొయ్యలులెల్లా
వోముచు నేమెప్పుడును వూడిగపువారము
నాములాయఁ దమకము వంచిననీకృపను
(॥వింత॥)
యెక్కడా నీసుద్దులే యెవ్వరైనాఁ బొగడేరు
వొక్కటై కూడిరి నిన్ను వువిదలెల్లా
చిక్కి నన్ను నేలితివి శ్రీవేంకటేశ్వర
వెక్కసమాయ భోగము వెలసె నీకృపను
(||pallavi||)
viṁtavāramā nemu visāriṁchugŏnavaya(yya?)
baṁti nunnāru sadulu pāyani nī kṛpanu
(||viṁta||)
yĕṁtaledu nīnavvu yĕnnilevu nīmāḍalu
aṁtaḍānu tanisiri yām̐ḍuvārĕllā
siṁtadīra nīgu nemu sevasesevāramu
dŏṁti nunnadi valabu tŏllĕ nīkṛpanu
(||viṁta||)
yemisesevu nīyāna lĕṟam̐gamā mībāsalu
domaḍigām̐ dŏḍigiri tŏyyalulĕllā
vomusu nemĕppuḍunu vūḍigabuvāramu
nāmulāyam̐ damagamu vaṁchinanīkṛpanu
(||viṁta||)
yĕkkaḍā nīsuddule yĕvvarainām̐ bŏgaḍeru
vŏkkaḍai kūḍiri ninnu vuvidalĕllā
sikki nannu nelidivi śhrīveṁkaḍeśhvara
vĕkkasamāya bhogamu vĕlasĕ nīkṛpanu