Vimtavaaraa neegu veeru viduva vimkaa guttu

వింతవారా నీకు వీరు విడువ వింకా గుట్టు
Language

(॥పల్లవి॥)
వింతవారా నీకు వీరు విడువ వింకా గుట్టు
వంతుతోడ నంత తలవంచనేల యిఁకను

(॥వింత॥)
చెవిలోన నీకు నే జేసిన విన్నపములు
అవల నీసతులెల్లా నడిగేరు
తివిరి యానతియ్య దేవరవే వారితోడ
జవళినేల నవ్వేవు సారెసారె నిపుడు

(॥వింత॥)
సమ్మతించి నేను నీతో సన్న సేసిన భావము
నెమ్మది విచారించేరు నీసతులు
తెమ్మలుగ నందరికి తెలుపువయ్యా నీసుద్ది
చిమ్ముచు నింతలోనేల సిగ్గువడ నీకును

(॥వింత॥)
లోలత నిన్ను జేవట్టి లోనికిఁ దీసిన పని
ఆలించి వినేమనేరు అతివలెల్లా
లాలించి శ్రీవేంకటేశ లలి నన్ను గూడితివి
పోలికలు చూపవయ్యా బొంకనేల యికను

(||pallavi||)
viṁtavārā nīgu vīru viḍuva viṁkā guṭṭu
vaṁtudoḍa naṁta talavaṁchanela yim̐kanu

(||viṁta||)
sĕvilona nīgu ne jesina vinnabamulu
avala nīsadulĕllā naḍigeru
tiviri yānadiyya devarave vāridoḍa
javaḽinela navvevu sārĕsārĕ nibuḍu

(||viṁta||)
sammadiṁchi nenu nīdo sanna sesina bhāvamu
nĕmmadi visāriṁcheru nīsadulu
tĕmmaluga naṁdarigi tĕlubuvayyā nīsuddi
simmusu niṁtalonela sigguvaḍa nīgunu

(||viṁta||)
lolada ninnu jevaṭṭi lonigim̐ dīsina pani
āliṁchi vinemaneru adivalĕllā
lāliṁchi śhrīveṁkaḍeśha lali nannu gūḍidivi
poligalu sūbavayyā bŏṁkanela yiganu