Vimtaseli vaddanumte veladigi siggugaadaa

వింతచెలి వద్దనుంటే వెలదికి సిగ్గుగాదా
Language

(॥పల్లవి॥)
వింతచెలి వద్దనుంటే వెలదికి సిగ్గుగాదా
యెంతైనా నెరఁగదు యెటువంటి యాఁటది

(॥వింత॥)
ఇంతి తనకాఁతాళాన ఇద్దరముఁ గూచుండఁగా
సంతలో సుద్దులు చెప్పీ సారెసారెకు
మంతన మాడేనంటా మనసు పట్టఁగలేక
చెంత నేకతములాడీ చెవిలోనే తాను

(॥వింత॥)
యీకె దనవేడుకతో యెదుట నే నుండఁగానే
ఆకుమడిచియ్యవచ్చీ నదే నీవద్ద
నీకుఁ బాదాలొత్తేనంటా నెపములు సేసుకొని
చేకొని కూచుండీని చేరి పానుపుమీఁద

(॥వింత॥)
తతి నిన్నుఁ గూడేయాసఁ దలుపు దెరచుకొని
రతిసేయవచ్చీఁ గాఁతరాన నీడకు
యితవై శ్రీవేంకటేశ యిప్పుడే నన్నేలితివి
సతి పెనఁగాడేనంటా మతకము సేసీని

(||pallavi||)
viṁtasĕli vaddanuṁṭe vĕladigi siggugādā
yĕṁtainā nĕram̐gadu yĕḍuvaṁṭi yām̐ṭadi

(||viṁta||)
iṁti tanagām̐tāḽāna iddaramum̐ gūsuṁḍam̐gā
saṁtalo suddulu sĕppī sārĕsārĕgu
maṁtana māḍenaṁṭā manasu paṭṭam̐galega
sĕṁta negadamulāḍī sĕvilone tānu

(||viṁta||)
yīgĕ danaveḍugado yĕduḍa ne nuṁḍam̐gāne
āgumaḍisiyyavachchī nade nīvadda
nīgum̐ bādālŏttenaṁṭā nĕbamulu sesugŏni
segŏni kūsuṁḍīni seri pānubumīm̐da

(||viṁta||)
tadi ninnum̐ gūḍeyāsam̐ dalubu dĕrasugŏni
radiseyavachchīm̐ gām̐tarāna nīḍagu
yidavai śhrīveṁkaḍeśha yippuḍe nannelidivi
sadi pĕnam̐gāḍenaṁṭā madagamu sesīni